ఆంధ్రప్రదేశ్ లోని ఓ మారుమూల జిల్లా శ్రీకాకుళం.. ఏపీలో అతి ఎక్కువగా వెనుకబడిన జిల్లాల్లో ఈ జిల్లా ఒకటి. అంతే కాదు.. ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్న జిల్లా.. జిల్లా నుంచి వచ్చిన ఓ మహిళ.. మహిళా దినోత్సవం రోజు రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డు అందుకుంది. జాతీయ వేదికపై శ్రీకాకుళం జిల్లా పేరును మారు మోగించింది.

 

 

అసలు ఇంతకీ ఈ పడాల భూదేవి ఎవరు.. ఆమె గొప్పదనం ఏంటి.. ఈమె శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట ప్రాంతానికి చెందిన మహిళ.. ఈమె గొప్పదనం ఏంటంటే.. ఆమె చిన్నయ్య ఆదివాసీ ట్రస్ట్ పేరుతో ఓ సొసైటీ ని నడుపుతోంది. ఆమె స్వయంగా సవర తెగకు చెందిన గిరిజన మహిళ. చిన్న తనంలోనే వివాహమై.. అనేక కష్టాలు అనుభవించింది.

 

 

ఆ తర్వాత తండ్రి బాటలో నడిచింది. ఆమె తండ్రి చిన్నయ్య ఆదివాసీ ట్రస్ట్ నెలకొల్పి గిరిజనులకు సాయపడేవారు. ఆయన మరణం తర్వాత భూదేవి ఆట్రస్టు బాధ్యతలు చేపట్టింది. స్వయంగా గిరిజన మహిళలను కలిసి.. వారిలో చైత్యం నింపింది. వారిని వారి సొంత కాళ్లపై నిలబడే వారిగా తీర్చి దిద్దింది. ప్రస్తుతం ఆమె ఐటీడీఏతో కలసి పని చేస్తోంది.

 

 

1996 లో తన తండ్రి స్థాపించిన ఆదివాసి వికాస్ సొసైటీ ద్వారా గిరిజన మహిళలు, వితంతువులు, పోడు భూముల అభివృద్ధికి చేస్తున్న కృషికి గానూ ఆమెకు ఈఏడాది మహిళా పురస్కారం దక్కింది. దాదాపు 60 మంది వరకూ మహిళలు భూదేవి స్ఫూర్తితో వ్యాపారవేత్తలుగా అవతారం ఎత్తారు. వారు తయారు చేసే అటవీ ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులకు చక్కని డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఎక్కువగా డిమాండ్ ఉన్న మిల్లెట్ లను ఆమె నాయకత్వంలో గిరిజన మహిళలు పండించి మంచి ఆదాయం సంపాదిస్తున్నారు.

 

 

భూదేవితో పాటు బీనాదేవి, అరిఫ్ జాన్, చామి ముర్ము, నిల్జా వాంగ్మో, రష్మీ ఉర్దువరేశి, మన్‌కౌర్, కళావతి దేవి, కౌషికీ చక్రవర్తి, అవని చతుర్వేది, భవనకాంత్, మోహనసింగ్, భగీరథి అమ్మ, కార్తియాని అమ్మ నారీశక్తి పురస్కారాలను అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: