దాదాపు ఒక సంవత్సరం క్రితం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అయిన మారుతీరావు చాలా నాటకీయ పరిస్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు దీనిని ఆత్మహత్యగా ముందు పరిగణించగా తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నట్లు ఎటువంటి ఆధారాలు ఇప్పటికీ లభించకపోవడంతో వారు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే మారుతీ రావు మరియు ప్రణయ్ ఇంటి వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు నిదానంగా ఒక్కొక్క విషయాన్ని బయటకు తీస్తున్నారు.

 

IHG

 

కోటీశ్వరుడైన మారుతీరావు తన కూతురు అమృత ఒక దళిత యువకుడి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అన్న కోపంతో అతనిని అతి దారుణంగా హత్య చేయించగా కొద్దిరోజుల తర్వాత మారుతి రావు జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. తర్వాత అతను తీవ్రమైన మనస్థాపంతో రగిలిపోయాడు అని అతని కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు చెబుతున్నారు. ఇకపోతే ఉన్న ఒక్కగానొక్క కూతురు అతని ద్వేషిస్తూ ఉండడంతో అతని ఆస్తికి సంబంధించిన వీలునామా చాలా ముందే రాసేశాడు మారుతి రావు.

 

IHG

 

అతని యావదాస్తిని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని అతని భార్యకు ఇచ్చాడు. ఇక రెండవ భాగాన్ని ఒక ట్రస్ట్ పేరిట రాయగా చివరిదైన మూడో భాగాన్ని తన ఏకైక సోదరుడి యొక్క కొడుకులకు పేరు మీద రాసిచ్చేశాడట. దీనిని బట్టి చూస్తే మారుతీరావు తన ఆత్మహత్యకు ముందునుంచే ప్రిపేర్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అతనితో ఉన్నా కూడా అతని భార్య ఆస్తిని అనుభవించవచ్చు. కానీ అతను చావు గురించి అతనికి ముందే తెలుసు కాబట్టి మారుతీరావు తన భార్యకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందే ఆస్తిని రాసి ఇచ్చినట్లు పలువురు అనుకుంటున్నారు.

 

ఇకపోతే తన కూతురు విషయంలో జరిగిన అన్యాయానికి కుమిలిపోయిన మారుతిరావు తన మిగిలిన ఆస్తిని ట్రస్ట్ కి మరియు ఇక తన రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడి కొడుకులకి అనూహ్యంగా రాసిచ్చేసిన తీరుని చూస్తుంటే మారుతీరావు తీవ్రమైన మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: