ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీ రావు హైదరాబాద్‌ లోని వైశ్య భవన్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన వద్ద లభించిన ఆత్మహత్య లేఖ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఆత్మ హత్య లేఖలో చాలా మంది తమ చావుకు దారి తీసిన పరిస్థితులు రాస్తుంటారు. తాము ఎందుకు చనిపోతున్నామో.. అందుకు కారణం ఎవరో రాస్తుంటారు. కానీ మారుతీ రావు అవేమీ రాయలేదు.

 

 

మారుతీ రావు రాసిన ఆత్మహత్య లేఖ సింపుల్ గా రెండే వాఖ్యాల్లో ఉంది. గిరిజా నన్ను క్షమించు.. అమృతా అమ్మ దగ్గరకు రా.. ఇంతే.. ఈ రెండు వాక్యాలే ఆయన రాశారు. ఈ లేఖలో గిరిజా అంటే ఆయన భార్య.. ఆమెను ఒంటరిని చేసి వెళ్లిపోతున్నందుకు ఆమెకు క్షమాపణలు చెప్పారనుకోవచ్చు.. ఇక తన కూతురు అమృతను తల్లి దగ్గరకు రమ్మని ఉద్దేశించి.. అమృతా.. అమ్మ దగ్గరకు రా అని రాశారు.

 

 

మరోవైపు ఈ ఈ ఘటనకు దారితీసిన కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మారుతీ రావు ఆత్మహత్యకు ఆస్తి తగాదాలు కూడా ఓ కారణమా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే.. ఇటీవల మారుతీరావు తన వీలునామాను తిరగ రాశారని వార్తలు వస్తున్నాయి. తన కుమార్తె అమృత భర్త అయిన ప్రణయ్‌ను అంతమొందించేందుకు ముందు ఆస్తిని తన తదనంతరం తమ్ముడు శ్రావణ్‌కు చెందేలా మారుతీరావు వీలునామా రాసినట్లు సమాచారం.

 

 

కానీ.. ఇటీవల వీలునామాను మారుతీరావు మార్చి రాయించారు. వీలు నామా నుంచి తమ్ముడి పేరును తొలగించాడని తెలుస్తోంది. అదే సమయంలో కూతురు అమృతతో సయోధ్య కోసం కొంత కాలంగా మారుతీరావు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. తన ఇంటికి వచ్చేస్తే ఆస్తి కూతురికి రాసిస్తానని ఆయన ప్రపోజ్ చేసినట్టు తెలిసింది. అంతే కాదు.. కోర్టులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పేలా కూడా మారుతీరావు అమృతపై ఒత్తిడి తెచ్చినట్టు చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: