మారుతీ రావు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు.. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని కిరాయి హంతకులతో అతి దారుణంగా హత్య చేయించిన వ్యక్తిగా ఆయన చాలా రోజులు వార్తల్లో నలిగాడు. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీ రావు మృత దేహం వద్ద లభించిన ఆత్మహత్య లేఖ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.

 

 

ఆత్మ హత్య లేఖ చాలా సింపుల్ గా ఉంది. రెండే వాక్యాల్లో ఆయన తన ఫీలింగ్స్ చెప్పేశారు. గిరిజా నన్ను క్షమించు.. అమృతా అమ్మ దగ్గరకు రా.. ఇంతే.. ఈ రెండు వాక్యాలే ఆయన రాశారు. ఈ లేఖలో గిరిజా అంటే ఆయన భార్య.. ఆమెను ఒంటరిని చేసి వెళ్లిపోతున్నందుకు ఆమెకు క్షమాపణలు చెప్పారనుకోవచ్చు.. ఇక తన కూతురు అమృతను తల్లి దగ్గరకు రమ్మని ఉద్దేశించి.. అమృతా.. అమ్మ దగ్గరకు రా అని రాశారు.

 

 

ఆయన కొంత కాలంగా.. కూతురు అమృతతో రాయబారం నడిపినట్టు చెబుతున్నారు. తన వద్దకు వచ్చేస్తే.. ఆస్తి మొత్తం ఆమె పేరుపై రాసేస్తానని రాయబారం నడిపారని అంటున్నారు. అయితే అందుకు అమృత ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. అసలు తండ్రితో మాట్లాడేందుకు కూడా ఆమె ఇష్టం చూపించలేదని.. తెలుస్తోంది. ఎలాగూ ఉరిశిక్ష పడుతుందన్న భావనలో ఉన్న మారుతీ రావు.. కూతురు కూడా కరుణించకపోవడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు.

 

 

మరి ఇప్పుడు అమృత ఏం చేస్తుంది.. తండ్రి చివరి కోరిక తీరుస్తుందా.. తండ్రి మరణంతోనైనా ఆమె తన తల్లి వద్దకు చేరుతుందా అన్నది చూడాలి. అయితే మారుతీరావు మరణంపై అమృత స్పందించిన తీరు చూస్తే.. ఆయన చివరి కోరిక తీరడం కష్టమే అనిపిస్తోంది. మరోవైపు ఆమె అసహ్యంచుకునే తండ్రి ఎలాగూ లేడు కాబట్టి తల్లి వద్దకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏదేమైనా నిర్ణయం తీసుకోవాల్సింది ఆమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: