మొన్నటి వరకు చైనా దేశంలో మరణ మృదంగం వాయించి  ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న ప్రాణాంతకమైన కరోనా  వైరస్ ఇప్పుడు ఏకంగా భారత్లో కూడా అందరిని బెంబేలెత్తుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత్ లో  ప్రవేశించిన ఈ వైరస్ శర వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశవ్యాప్తంగా ఏకంగా 30 కి పైగా కరోనా  పాజిటివ్ కేసులు నమోదవ్వగా ... దేశవ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లో ఈ కేసులు ఎక్కువవుతు  ఉండడంతో... ప్రజల్లో కరోన  భయం పట్టుకుంది. అయితే కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ ఈ కరోనా  మాత్రం విజృంభిస్తునే  ఉంది. అయితే నేడు హోలీ పండుగ నేపథ్యంలో ఢిల్లీలోని ఆలిండియా మెడికల్ సైన్స్ వైద్యనిపుణులు సంచలన హెచ్చరికలు జారీ చేశారు. 

 

 

 దేశంలో శరవేగంగా కరోనా  వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో చాలా మంది ప్రజలు ఒకేచోట గుమికూడి హోలీ పండుగను జరుపుకోవడం ద్వారా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని ఎయిమ్స్ వైద్యులు సూచిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 39 కరోనా  వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలెవరూ హోలీ ఆడ వద్దు అంటూ సూచిస్తున్నారు. ప్రజలు హోలీ ఆడకుండా... రంగులకు దూరంగా ఉండాలని... ఎన్95 మాస్క్ లను వాడి... కరోనా  రాకుండా ముందు జాగ్రత్త పడాలి అంటూ సూచిస్తున్నారు. 

 

 

 అంతేకాకుండా దగ్గు జలుబు జ్వరం ఉన్న వ్యక్తులతో హోలీ ఆడకూడదు అంటూ సూచిస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న వ్యక్తులతో హోలీ ఆడడం వల్ల ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా ఇన్ఫెక్షన్ సోకి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. జలుబు దగ్గు జ్వరం తో బాధపడుతున్న వ్యక్తులకు ఆరు మీటర్ల దూరంలో ఉండాలని... అందుకే ఈ ఏడాది హోలీ పండుగకు ప్రజలు దూరంగా ఉంటేనే మంచిది అంటూ సూచిస్తున్నారు. అంతేకాకుండా హోలీ పండుగలో చైనా రంగు ఎక్కువగా ఉంటాయి కాబట్టి... వాటికి దూరంగా ఉండటం ఆరోగ్యానికి ఎంతో మంచిది అని సూచిస్తున్నారు. హోలి రంగుల కారణంగా ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సోకే అవకాశం ఉందని... దేశంలో కరోనా  వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న  నేపథ్యంలో ప్రజలందరూ హోలీ కి దూరంగా ఉండడం ఎంతో మేలు అంటూ ఎయిమ్స్ వైద్యులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: