అన్నమయ్య.. భక్తి సామ్రాజ్యాన్ని తన ఎనలేని కీర్తనలతో ఏలిన మహా చక్రవర్తి.. ఒక మనిషికి భగవంతుడు ప్రత్యక్షం అవడం ఏంటి.. ఆయన కీర్తనలకు పరవశించడం ఏంటి.. జన్మ కారకుడైన అన్నమయ్య జననం, ఆయన బాల్యం, యవ్వనం ఇవన్ని సాదాసీదాగా జరిగాయి.. కానీ అన్నమయ్య జీవితాన్ని మలుపు తింపిన ఘటన ఆ స్వామి వారి దర్శనం.. ఒక ఆయన స్పర్శతో అంతవరకు ఉన్న ఆయన ప్రపంచం కనుమరుగై పోయింది.. నిజమైన ప్రపంచం అంటే ఏంటో తెలిసి వచ్చింది..

 

 

అంతటి భక్తిని పొందిన అన్నమయ్య నిజమైన విజేత.. ఇక భక్తి అంటే ఏదో కళ్లు మూసుకుని దండంపెట్టి మన అవసరాల కోసం భగవంతున్ని ప్రార్ధించడం కాదు.. ఈ భూమండలాన్ని ఏలే భగవంతుని యొక్క గుణగణాలను ఆకళింపు చేసుకొని అనుసరించేదే భక్తి, భగవంతుని గురించి తెలుసుకొని భగవద్భక్తితో అనుసరించేవాడే భక్తుడు... ఇక భవంతుడు అనే పదార్ధాన్ని పొందాలంటే ఉన్న మార్గాలు తొమ్మిది.. వీటిలో ఏది ఆచరించిన ఆయనను ప్రసన్నం చేసుకోవచ్చు.. ఇలాగే అన్నమయ్య కూడా ఆ దేవదేవుని అనుగ్రహం పొందడానికి కీర్తనం అనే మార్గాన్ని ఎంచుకున్నాడు.. ఆ భగవంతుని నామము గానము చేయుచు, ఆయన కీర్తనలను భక్తితో కీర్తించుచు.. తన దరికే ఆ శ్రీనివాసున్ని రప్పించుకున్నాడు.. ఇదికాదా నిజమైన భక్తికి నిలయం, ఆయన హృదయం అని గ్రహించవలసిన విషయం ఇది..

 

 

నేటికాలంలో మనిషి తప్పుడు ఆలోచనలతో నిజమైన భవంతుని తత్త్వాన్ని గుర్తించడం లేదు.. ఒకరకంగా తన దాహం తీర్చుకోవడానికి ఎండమావుల దగ్గరికి పరిగెత్తుతున్నాడు.. అందుకే ఎన్నో ఇతర దైవాల్ని కొలిచి కప్పబడి ఉన్న పరమాత్మ కరుణను పొందడం అనేది పిప్పిని‌ రుచి అడగడంలాంటిది అంటున్నారు అన్నమయ్య‌. ఆ చెప్పడం చూడండి‌ ఎంత ఉన్నతంగా ఉందో.. తప్పుడు చదువులు మనల్ని‌ చెడగొట్టాయి. మనకు లభ్యమవుతున్నవి తప్పుడు చదువులే. వాటిని‌ చదివి‌, చదివి మనం తత్త్వం తెలుసుకోలేక పోతున్నాం. తప్పుడు‌ చదువుల ఎండమావులవల్ల మన దాహం తీరడం‌ లేదు. మనం అల్లాడుతున్నాం.

 

 

ఇక్కడ కప్పిన అని అన్నమయ్య చెప్పినది "నాహం ప్రకాశ స్సర్వస్య యోగమాయాసమావృతః" అని భగవద్గీత (అధ్యాయం 7 శ్లోకం 25)లోని వాక్యానికి సరిపోతోంది... అంటే యోగులందరికీ నేను తెలుస్తాను. కపటం చేత బాగా ఆవరించబడ్డ వాళ్లకు నేను లేను అనీ ఈ వాక్యానికి‌ అర్థం.. నిజంగా ఆ కలియుగ వాసుని పైన ఆయన చేసిన రచనలు, కీర్తనలు ఒక్క భవంతున్నే కాదు.. అవి విన్న ప్రతి వారి హృదయాన్ని సృషిస్తుంది.. అందుకే నాటినుండి నేటి వరకు, అసలు ఈ సృష్టి ఉన్నంతవరకు అన్నమయ్య అనే పేరు నిలిచిపోతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: