చైనాలోని వుహాన్  నగరంలో గుర్తించబడిన ప్రాణాంతకమైన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. చైనాలో ఇప్పటికే ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి మూడు వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు... అంతేకాకుండా 90 వేల మందికి పైగా ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతున్నారు. అయితే చైనా దేశంలో మొన్నటివరకూ విలయతాండవం చేసినా ప్రాణాంతకమైన కరోనా  వైరస్ ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది. కానీ ఇప్పటికే ఇతర దేశాలకు వ్యాప్తి చెందిన ఈ ప్రాణాంతకమైన వైరస్ విజృంభిస్తుంది అనే చెప్పాలి. ఇప్పటికే మహమ్మారి వైరస్ 60 దేశాలకు పైగా వ్యాప్తి చెందింది. 

 

 

 ఆయా దేశాలలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఆయా దేశాల ప్రభుత్వాలు ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా... వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. ఈ మహమ్మరి కరోనా  ఎఫెక్ట్ భారతదేశంలో కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో 30కిపైగా కరోనా  కేసులు నమోదయ్యాయి.ఇక ఈ ప్రాణాంతకమైన కరోనా  ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ వరకు వచ్చేసింది. తాజాగా భారత ప్రధాని బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ శతాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు... ఈ నెల 17న భారత ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ కి వెళ్ళాల్సి ఉంది. 

 

 

 కానీ తాజాగా బంగ్లాదేశ్ లో కరోనా  కేసులు నమోదైన నేపథ్యంలో... ప్రధాని నరేంద్ర మోడీ ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇటీవల ఇటలీ  నుంచి బంగ్లాదేశ్ కు వచ్చిన ఇద్దరు స్వదేశీ లకు జ్వరం దగ్గు తీవ్రంగా ఉండడంతో పరీక్షలు నిర్వహించగా కరోనా  పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. ఈ నేపథ్యంలో శతజయంతి వేడుకలను వాయిదా వేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉంటే ఈ నెల 13న బ్రస్సెల్స్ లో  ఈయు కార్యాలయంలో నిర్వహించిన సదస్సుకు కూడా హాజరు కావాల్సి ఉన్నా...కరోనా  ఎఫెక్టుతో ఈ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: