చైనాలోని వుహాన్  నగరంలో గుర్తించబడిన ప్రాణాంతకమైన కరోనా  వైరస్ మన దేశ వ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రాణాంతకమైన మహమ్మారి బారిన పడి ఇప్పటికే మూడు వేల మందికి పైగా మరణించారు. అంతేకాకుండా 90,000 మంది ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఇక ఈ ప్రాణాంతకమైన వైరస్ ప్రపంచ దేశాలకు కూడా వ్యాపించింది...దీంతో  ఎంతోమందిని ప్రాణ భయంతో వణికి పోతోన్నారు . ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన వైరస్  మాత్రం శరవేగంగా వ్యాప్తి చెందుతుంది.అయితే ఇప్పుడిప్పుడే చైనా దేశంలో కరోనా  సోకిన వ్యక్తులు మెల్లమెల్లగా కోలుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా చైనాలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇదే అక్కడ హాట్ టాపిక్ గా మారిపోయింది.

 

 

 చైనాలో ఇప్పటికే ఎంతోమంది కరోనా వైరస్ సోకి ప్రత్యేక చికిత్స అందుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ వందేళ్ళ వృద్ధుడికి కరోనా  వైరస్ సోకింది. కానీ ఆ వృద్ధుడు కరోనా ను  జయించి మరీ మృత్యుంజయుడు అయ్యాడు. దీంతో ప్రస్తుతం చైనాలో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. కరోనా  లక్షణాలతో బాధపడుతున్న వుహాన్ నగరానికి  చెందిన వంద ఏళ్ల వృద్ధుడు... గత నెల 24న హుబెయి  లోని మెటర్నిటీ అండ్ హెల్త్ కేర్ ఆస్పత్రిలో చేరాడు. అయితే ఆ వృద్ధుడికి ఫ్లూ లక్షణాలతో పాటు అల్జీమర్స్ బిపి హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక ఆ వందేళ్ల వృద్దుడికి  అక్కడి వైద్యులు 13 రోజుల పాటు ప్రత్యేక చికిత్సలు అందించారు. 

 

 

 

 ఇక తాజాగా ఆ వృద్ధుడిని పరీక్షించిన వైద్యులు కరోనా  లక్షణాలు లేవు అని నిర్ధారించారు. దీంతో ఆ 100 ఏళ్ల వృద్ధుడి తో పాటు కరోనా  వైరస్ నుంచి కోలుకున్న మరో 80 మందిని కూడా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు వైద్యులు. అయితే ఇప్పటివరకూ కరోనా  నుంచి బయటపడిన అతిపెద్ద వయస్కుడిగా ఆ వృద్ధుడు రికార్డు సృష్టించాడు. అయితే వుహాన్  నగరంలో మొదటగా వెలుగులోకి వచ్చిన ఈ ప్రాణాంతకమైన వైరస్... ఇప్పటివరకూ మూడు వేల మందికి పైగా పొట్టన పెట్టుకుంది. అంతేకాకుండా ఈ ప్రాణాంతకమైన వైరస్ ఎన్నో  దేశాలకు పైగా విస్తరించింది. ఇక మన భారతదేశం విషయానికి వస్తే ఇప్పటికే 39 కరోనా  కేసు నమోదైన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: