ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా  భయం పట్టుకున్న విషయం తెలిసిందే. మొదట చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ ప్రాణాంతకమైన వైరస్ చైనాలో విజృంభించి మరణమృదంగం మోగించింది . ఒక్కసారిగా విజృంభించి ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది ఈ ప్రాణాంతకమైన వైరస్. ఇక చైనా దేశంలో ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి మూడు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు 90 వేల మందికి పైగా మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. ఇక ఇప్పటికే 69 దేశాలకు కూడా ఈ ప్రాణాంతకమైన మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. 

 

 

 దీంతో ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా ఎన్నో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. ఇక వివిధ దేశాలలో కరోనా  విజృంభిస్తున్న నేపథ్యంలో ఎంతో మంది ప్రముఖులు ఆయా దేశాలకు పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పలు దేశాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యి  ప్రజలకు అవగాహన కూడా కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ కరోనా  వైరస్లు ముప్పు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి పొంచి ఉండటం తీవ్ర కలకలం రేపింది. గత నెల 26 నుంచి 29 వరకూ వాషింగ్టన్ లో నిర్వహించిన కన్జర్వేటివ్ పొలిటికల్ కాన్ఫరెన్స్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. 

 

 

 అయితే ఈ సదస్సులో పాల్గొన్న ఇద్దరికీ కరోనా  వైరస్ నిర్ధారణ అయింది. ఇప్పటికే అమెరికా లోని 30 రాష్ట్రాలకు ఈ ప్రాణాంతకమైన కరోనా  వ్యాపించింది. అమెరికాలో బాధితుల సంఖ్య 401 చేరగా మృతుల సంఖ్య 19కి  చేరింది. అయితే ట్రంపు సదస్సులో పాల్గొన్న వారికి కరుణ వైరస్ సోకడంతో... ప్రస్తుతం కలకలం రేగింది. ఈ వైరస్ ప్రభావం ఆ ఇద్దరికీ గత కొన్ని రోజుల నుండి ఉండవచ్చు అని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా  సోకిన ఆ ఇద్దరూ... ఏకంగా అమెరికా అధ్యక్షుడు పాల్గొన్న కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ లో కూడా పాల్గొనడంతో... కరోనా  నుంచి ఏకంగా అమెరికా అధ్యక్షుడికి ముంపు పొంచి ఉన్నట్లు అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: