ప్రపంచ దేశాలను ప్రాణభయంతో వణికిస్తోంది కరోనా వైరస్. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ ప్రాణాంతకమైన వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు కూడా వేగంగా వ్యాప్తి చెందుతూ అందరిని ప్రాణభయంతో బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు మూడు వేల మందికి పైగా చైనా దేశంలో ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఈ ప్రాణాంతకమైన వైరస్... ప్రస్తుతం చైనా దేశంలో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఇతర దేశాలలో మాత్రం విజృంభిస్తు శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇక ఈ ప్రాణాంతకమైన వైరస్ కు  సరైన వ్యాక్సిన్  కూడా లేకపోవడంతో అటు  ప్రజలు కూడా భయపడిపోతున్నారు. 

 

 

 ఇక ఈ ప్రాణాంతకమైన వైరస్ భారత్ కి  కూడా చేరుకున్న విషయం తెలిసిందే. మొదట కేరళలో మూడు కేసులు నమోదవగా భారత ప్రభుత్వం ఎన్నో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అయినప్పటికీ ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. ప్రస్తుతం భారత్లో ఏకంగా 39 కరోనా  పాజిటివ్ కేసులు నమోదు అవ్వడం భారత ప్రజల్లో భయాన్ని ఆందోళనను కలిగిస్తోంది. అయితే అటు కేంద్ర ప్రభుత్వం సహా  రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని అవగాహన చర్యలు చేపట్టిన ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా మాత్రం ఏదో ఒక విధంగా వేగంగా వ్యాప్తి చెందుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకు 39 కరోనా  పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ... కరోనా  అనుమానితుల సంఖ్య మాత్రం భారీగానే ఉంది. 

 

 

 ఇలా కరోనా  అనుమానితులు ఎంతోమంది ప్రత్యేకంగా ఐసొలేషన్  వార్డుల్లో చికిత్సను అందుకుంటున్నారు. అయితే తాజాగా కరోనా  లక్షణాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందారు.  లడక్ కి చెందిన మహమ్మద్ అలీ కరోనా  లక్షణాలు కనిపించడంతో... లేహ్  ఆస్పత్రిలో చేరి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందుకుంటున్నాడు. ఇటీవలే ఇరాన్  పర్యటించి వచ్చిన అతడికి కరోనా  లక్షణాలు ఉండటం తో.. వైద్యులు అతనికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. కాగా అతను తాజాగా మృతి చెందాడు. ఇక మరోవైపు వెస్ట్ బెంగాల్ ముర్షీదాబాద్ కు చెందిన మరో వ్యక్తి కూడా ఇలాగే మృతి చెందడం కలకలం రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: