పండుగ అంటేనే ఆనందం. అంతా కలిసి ఆనందంగా నవ్వుకుంటూ కలిసి మెలిసి జరుపుకుంటారు పండుగని. చక్కగా సమయాన్ని గడిపి ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ప్రతీ పండుగకి ఒక పద్ధతి, విశిష్టత ఇలా ఉంటాయి. ఆ పండుగ వెనుక కారణం కూడా ఉంటుంది. అయితే పండుగ రోజు అంతా కలిసి ఆనందంగా గడుపడం ఒక్కటి తెలిస్తే చాలదు. పండుగ వెనుక కారణాలు తెలుసుకోవడం కూడ ముఖ్యం. ఒక్కో పండుగని ఒక్కో విధంగా జరుపుకుంటారు. అంతా ఒక్కటే దేశమైనా వివిధ పద్ధతుల్లో పండుగని జరుపుకుంటూ ఉంటారు.

 

 

హోలీ పండుగ అనేక విధాలుగా జరుపుకుంటూ ఉంటారు. బ్రహ్మచే వరం పొందిన హిరణ్యకశ్యపుడు చావు లేదు అని తెలిసి ఎంతో ఉత్సాహం అయ్యిపోయాడు. అయితే ఇంక స్వర్గాన్ని, భూమిని కూడా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. దేవుళ్ళని పూజించకుండా తననే పూజించాలని ఆజ్ఞాపించాడు. కానీ ఇతని కొడుకుని విష్ణు భక్తి నుండి మాత్రం మార్చలేకపోయాడు. అతని కొడుకు అయిన ప్రహ్లాదుడుని అనేక బాధలు పెట్టాడు. విషం పోసాడు కానీ అది అమృతం అయ్యింది. ఏనుగులు చేత తొక్కించమన్నాడు కానీ ఏ హానీ జరగలేదు. చివరికి తన సోదరి హోలిక నిప్పుల ఒళ్ళో కూర్చోమన్నాడు. సరే అని అలానే చెసాడు. హోలిక మంటల నుండి కాపాడే శాలువని ధరించింది. ప్రహ్లాదుడు విష్ణువుని ప్రార్ధించాడు. అయితే ఆ శాలువ ఎగిరిపోయింది. ఆ శాలువ ప్రహ్లాదుడిపై పడుతుంది. హోలిక మరణిస్తుంది.

 

 

తర్వాత విష్ణువు నరసిమ్హ అవతారంలో హిరణ్యకశ్యపుడుని పంజాలతో చంపేస్తాడు. ప్రాథమిక పరిశోధనల ప్రకారం ఏడవ శతాబ్దంలో రత్నావళి అనే ఒక  సంస్కృత నాటకం వలన హోలీ పండుగ ఉత్సవాలు జరుపుకొన్నారని తెలిసింది. అయితే హొలీ రోజు పొడవైన చిమ్మె గొట్టల నుండి కానీ కలర్ గన్స్ నుండి కానీ రంగులు విసురుకుని పండుగ చేసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: