సమాజంలో పుకార్లు ఎంత వేగంగా వ్యాపిస్తున్నాయంటే.. గాలికంటే వేగం వీటికే ఎక్కువగా ఉంది.. ఈ పుకార్లు ఒక్క విషయంలో జరుగుతున్నాయని చెప్పడానికి వీలు లేదు..  కంటికి కనిపించని ఈ పుకార్లు చెవులకు మాత్రం చాలా త్వరగా చేరుతాయి.. ఎక్కడో ఒక వ్యక్తి పిల్లిని పట్టుకున్నాడని అంటే.. ఒక వ్యక్తి చేతికి పులి చిక్కిందంట.. అని పుకారు, షికారు చేస్తుంది.. ఇదిగో ఇలాంటి పుకార్లు డబ్బుల విషయంలో చాలా జరుగుతున్నాయి..

 

 

ఆ మధ్య కాలంలో పది రూపాయల కాయిన్స్ చెల్లవని పుకారు లేచింది.. తర్వాత పెద్ద నోట్ల రద్దు.. జరిగిన తర్వాత కొత్త రెండువేల నోట్లు వచ్చినాక కూడా మళ్లీ ఈ రెండువేల నోటు కూడా ఇక కనిపించవని, త్వరలో వేయి రూపాయల నోట్లు మార్కెట్లోకి వస్తున్నాయని వార్తలు గుప్పుమంటున్నాయి.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూ.1,000 నోట్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చిందనే ఈ ఫేక్ న్యూస్.. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా యాప్స్‌లో తెగ షేర్ అవుతున్నాయి. అయితే ఈ విషయం మొత్తాన్నికి, పీఐబీ ఫ్యాక్ట్‌‌ చెక్‌కు చేరింది. ఇది తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కొత్త రూ.1,000 నోట్ల గురించి పూర్తి స్పష్టత ఇచ్చింది.

 

 

అదేమంటే సోషల్ మీడియాలో ఒక ఫేక్ రూమర్ సర్కులేట్ అవుతుంది. ఆర్‌బీఐ కొత్తగా రూ.1,000 నోట్లు తీసుకువచ్చిందని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇది నిజం కాదు. ఫేక్ మాత్రమే’ అని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్ తెలియజేసింది. అందువల్ల కొత్తగా రూ.1,000 నోట్లు వచ్చాయనే పుకార్లు విని మోసపోవద్దు. ఇకపోతే ఈ ఫేక్ వార్తలపై స్పందించిన రిజర్వు బ్యాంక్. ఇలాంటి నోట్లను జారీ చేయలేదని స్పష్టతనిచ్చింది.

 

 

అందువల్ల కరెన్సీ నోట్ల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించడం మరీ మంచిది అని అంటున్నారు అధికారులు.. ఇకపోతే ఇలాంటి ఫేక్ న్యూస్‌కు ప్రచారం కల్పించడం చట్టరిత్యా నేరం కాబట్టి ఇలాంటి డమ్మీ వార్తల విషయంలో ప్రజలు ఎప్పటికప్పుడు జాగ్రత్తపడకపోతే పలు ఇబ్బందులను స్వాగతించినట్లే...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: