హోలీ అంటేనే రంగుల పండుగ. హోలి వివిధ ప్రదేశాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఒక్కో చోట ఒక్కో విధంగా ఫాలో అవుతూ ఉంటారు. అయితే హోలి వల్ల ప్రమాదమా? అన్న ప్రశ్నకు వివిధ జవాబులు ఉన్నాయి. ఈ పండుగలో రంగులతో ఆడుకోవడమే దీని ప్రాముఖ్యత. అయితే ఎవరి సాంప్రదాయం బట్టి వారు వారి పండగని జరుపుకుంటారు. ఒక్కొక్కరి తీరు ఒక్కో విధంగా ఉంటుంది. ప్రతీ ఒక్కరు వారి మార్గాన్ని అనుసరిస్తూ వారు ఆ పద్ధతిని ఫాలో అవుతారు. 

IHG

 

వసంత కాలం వచ్చి వాతావరణంలో వివిధ మార్పులు జరగడం వల్ల ప్రకృతికి సంబంధించిన వాటిని జల్లుకుంటూ ఉంటారు. నిమ్మ, కుంకుమ, పసుపు ఇలా ప్రకృతి సహజమైన వాటిని జల్లుకోవడం వల్ల సరైన మందులా ఉపయోగపడి ఏ వ్యాధికి గురవ్వకుండా సాయపడుతుంది. అయితే రాను రాను ఆ పద్ధతి పోతోంది. చక్కటి ప్రకృతికి సంబంధించిన వాటిని ఉపయోగించడం మానేసి రసాయన రంగులని వాడడం మొదలు పెట్టారు.

 

IHG

 

దీని వల్ల స్కిన్ దెబ్బతింటుంది. అనేక వాటికి గురవ్వుతారు ఈ రసాయన రంగుల వల్ల. అయితే ఢిల్లీ నుండి చేసిన ఒక శ్వేత పత్రము ద్వారా తెలిసినది ఏమిటంటే ముద్దలగా ఉన్న రంగులపై అధికంగా టాక్సిక్ రసయనాలు ఉంటాయి. అయితే మూత్రపిండాలు నశిస్తాయి. నీలం రంగు ముద్దలో చర్మ వ్యాధులకు కారణమయ్యే ప్రూసియన్ నీలం రంగు ఉపయోగించడం వల్ల, కాపర్ సల్ఫేట్ ఆకు పచ్చగా ఉండి కంటి ఎలర్జీకి కారణం అవుతుంది అంతే కాకుండా ఉబ్బినట్లు ఉండి తాత్కాలికముగా గ్రుడ్డి తనం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఒక్కో రంగు వల్ల ఒక్కో సమస్య ఉంది. కనుక రంగులతో హోళి చేసుకోవడం ప్రమాదం. కాబట్టి సహజమైన రంగులు వాడి సాధ్యమైనంత వరకు రసాయన రంగులకి దూరంగా ఉండడం ఎంతో మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: