ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యుల ఎంపిక పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీలో వైసీపీ కి 151 సీట్లు ఉండటంతో ఆ మేరకు నాలుగు రాజ్యసభ స్థానాలు దక్కబోతున్నాయి. ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వాల ఎంపికకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. దీంతో ఆశావాహులు తమను పంపాలంటే తమను రాజ్యసభకు పంపించాల్సిందిగా జగన్ ను పెద్ద ఎత్తున కోరుతున్నారు. దీంతో ఎవరిని ఎంపిక చేస్తే మరెవరికి కోపం వస్తుందో అన్న సందేహాలు జగన్ లో ఇంకా పోలేదు. ఇప్పుడు రాజ్యసభ స్థానాలు ఆశిస్తున్న వారంతా పార్టీకి, తనకు బాగా కావాల్సిన వారు కావడంతో జగన్ వీరిలో ఎవరిని ఎంపిక చేయాలా అనే ఆలోచనలో పడ్డారు. 

 

IHG


ఈ నేపథ్యంలో తనకు రాజ్యసభ సభ్యత్వం కావాలంటూ జగన్ బాబాయ్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి గట్టిగానే పడుతున్నట్లు తెలుస్తోంది. ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో వైవీకి టికెట్ ఇవ్వకుండా జగన్ పక్కనపెట్టారు. అప్పట్లోనే తనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లుగా తన సన్నిహితులతో చెప్పుకున్నారు. ఈ మేరకు ఆయన జగన్ వద్దకు తన మనసులో మాటను బయటపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఒక రాజ్యసభ సీటుని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కి అత్యంత సన్నిహితులైన పరిమళ్ నత్వానికి ఇచ్చేందుకు జగన్ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.

 

IHG


 మరొకరి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఈ ఇద్దరిలో ఒకరికేజి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో రాంకీ గ్రూప్స్ అధినేత అయోధ్య రామిరెడ్డి పేరు కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. మోపిదేవి వెంకటరమణ, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు, పండుల రవీంద్ర బాబు, ఇలా చాలా మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే వీరందరి కంటే తనకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గా వై.వి.సుబ్బారెడ్డి ప్రచారం చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ జగన్ మనసులో ఏముంది ? ఎవరికి రాజ్యసభ సభ్యత్వం కట్టబెడతారు ? అనే విషయాలు ఇంకా క్లారిటీ రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: