ఈ మద్య డబ్బు సంపాదించడానికి కొంత మంది కేటుగాళ్ళు చేస్తున్న మాయలు.. జిత్తులు చూస్తుంటే పోలీసులకు మైండ్ బ్లాక్ అవుతుంది.  డబ్బు సంపాదించడమే పరమావధిగా పెట్టుకున్న కొంత మంది నేరగాళ్ళు ఎన్నో అక్రమ మార్గాలు ఎన్నుకుంటున్నారు. ముఖ్యంగా హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్ దందా, అమ్మాయిలను ట్రాప్ చేసి వ్యభిచార వృత్తిలోకి దింపడం, చైన్ స్నాచింగ్, అక్రమ ఆయుధాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దారుణమైన పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.  అంతే కాదు థాయ్ మసాజ్ సెంటర్లు, బ్యూటీ పార్లర్ల ముసుగు లో వ్యభిచారం చేయిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. 

 

పోలీసులు పక్కా సమాచారంతో ఇలాంటి మోసగాళ్లకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నా కొన్ని సార్లు వారి కన్ను గప్పి తమ దందాలు కొనసాగిస్తున్నారు. ఇక మద్యం అక్రమ వ్యాపారం చేస్తూ కొంత మంది డబ్బులు సంపాదిస్తున్నారు.  తాజాగా ఓ వ్యక్తి  తన స్కూటీలో అక్రమంగా మద్యం సరఫరా చేస్తూ పోలీసులుకు అడ్డంగా బుక్ అయ్యాడు. అంత వరకు ఓకే కానీ ఆ పోలీసులు ఆ వ్యక్తి స్కూటీ చూసి అందులో మద్యం బాటీళ్లను వెలికి తీసే క్రమంలో కళ్లు బైర్లు కమ్మాయి.  గుజరాత్‌లోని బహ్రుచ్‌ ప్రాంతంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది.  ఓ వ్యక్తి తన స్కూటీలో మద్యం అక్రమంగా తరలిస్తున్నాడన్న వార్త అందిన వెంటనే పోలీసులు అలర్ట్ అయి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 

 

సదరు వ్యక్తి స్కూటీ నుంచి మద్యం బాటిళ్లు దాచిన విధానం చూసి పోలీసులు ఒక్కసారిగా విస్తుపోయారు. ఆ వ్యక్తి స్కూటీలోని ప్రతీ భాగంలో నుండి మద్యం బాటిళ్లు బయటకు తీసారు.  ఓరి నాయనో ఓ స్కూటీని ఇంత దారుణంగా కూడా వాడుతారా అని అర్థం అవుతుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మద్యం విక్రయం చేసే క్రమంలో ఇన్ని రకాల ఉపాయాలు ఉంటాయన్న విషయం ఈ సంఘటన చూస్తే అర్థం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: