ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు పలు కీలక నియోజకవర్గాల్లో యుద్ధాలను తలపిస్తున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం పశ్చిమగోదావరి జిల్లా లోని దెందులూరు. ఇక్కడ నుంచి వరుసగా రెండుసార్లు గెలవడం తోపాటు ప్రభుత్వ విప్ గా పనిచేసిన చింతమనేని ప్రభాకర్ దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది అధికారులపై చేసుకుని.. ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన చింతమనేనినిని పార్టీ అధినేత‌ చంద్రబాబు ఎప్పటికప్పుడు వెనకేసుకు వచ్చారు. చివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చింతమనేని పెద్ద రౌడీ అన్న ముద్రపడినా చంద్రబాబు మాత్రం ఆయనను ప‌న్నెత్తు మాట‌ అనేవారు కాదు. ఈ క్రమంలోనే గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి యంగ్ తరంగ్... జగన్ కు అత్యంత సన్నిహితుడు అయిన కొఠారు అబ్బయ్య చౌదరి రంగంలోకి దిగి సవాలు చేసి మరీ చింతమనేనిని మట్టికరిపించారు.

అప్పటినుంచి అబ్బ‌య్య‌ చౌదరి ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా హైలెట్ అయ్యారు. ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దెందులూరు నియోజకవర్గంలో వేంగి యుద్ధాన్ని (ఇప్ప‌టి దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం ఒక‌ప్ప‌టి వేంగి రాజుల రాజ‌ధాని క్షేత్రం) తలపించే ఉన్నాయి. జగన్.. పవన్ వ‌చ్చినా దెందులూరులో తనే గెలుస్తానని బీరాలు పోయిన చింతమనేనిపై అబ్బయ్య చౌదరి ఏకంగా 17000 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. చింత‌మ‌నేనిని ఓడిస్తాన‌ని సవాల్ చేసి మ‌రీ అప్పుడు అబ్బ‌య్య చౌద‌రి గెలిచారు. ఆ త‌ర్వాత చింతమ‌నేని జైలు ఊచ‌లు లెక్క‌పెట్టారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు చింత‌మనేనికి పెద్ద స‌వాల్‌గా మారాయి. నియోజకవర్గంలోని దెందులూరు, పెద‌వేగి, పెద‌పాడు మండ‌లాలు ఉన్నాయి.

ఈ మూడు మండ‌లాల్లో మ‌ళ్లీ క్వీన్‌స్వీప్ చేసి త‌న స‌త్తా చాటాల‌ని అబ్బ‌య్య చౌద‌రి ఇప్ప‌టికే కేత్ర‌రంగంలోకి దిగిపోయారు. అయితే నిన్న మొన్న‌టి వ‌ర‌కు చింత‌మ‌నేని వెంటే ఉన్న వాళ్లంతా ఇప్పుడు అబ్బ‌య్య చౌద‌రి వెంట న‌డుస్తున్నారు. ప‌దేళ్ల పాటు చింతమ‌నేని వెంట న‌డిస్తే చివ‌ర‌కు సీనియ‌ర్లు, టీడీపీ ఆవిర్భ‌వించి ఉన్న‌ప్ప‌టి నుంచి ఉన్న సీనియ‌ర్ల‌కు సైతం గౌర‌వం ఇవ్వలేద‌న్న ఆవేద‌న వారిలో ఉంది. ఇటు అబ్బ‌య్య చౌద‌రి స్థానిక ఎన్నిక‌ల్లోనూ చింతమ‌నేనికి చెక్ పెట్టాల‌ని వివాదాల‌కు దూరంగా ఉంటూ టీడీపీలో కీల‌క నేత‌ల‌ను పార్టీలో చేర్చుకోవ‌డంతో పాటు నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని కులాల‌ను క‌లుపుకుని పోతున్నారు. అటు ప‌దేళ్ల పాటు దెందులూరును ఏలిన చింత‌మ‌నేని ఇప్పుడు తాను చెపుతున్నా సొంత పార్టీ నేత‌లే త‌న‌ను ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో దిగాలు చూప‌పుతో బిత్త‌ర‌పోతూ స్థానిక ఎన్నిక‌ల‌కు మొక్కుబ‌డిగా ఎదుర్కొంటున్నారు. ఏదేమైనా అబ్బ‌య్య వ్యూహాలు చూస్తుంటే చింతమ‌నేనికి చివ‌ర‌గా ఉన్న ప‌రువు కూడా గంగ‌లో క‌లిపేసేలా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: