ఏపీలో ఈ నెలలో జ‌రిగే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష టీడీపీ ఇప్ప‌టికే చేతులు ఎత్తేసింది. ఇప్ప‌టికే ప‌లు సర్వేలు సైతం జ‌గ‌న్ వేవ్ ప్ర‌జ‌ల్లో ఎంత మాత్రం త‌గ్గ‌లేదని.. మొత్తం 90 శాతానికి పైగా ఫ‌లితాలు వైసీపీకి అనుకూలంగా వ‌స్తాయ‌ని.. మ‌హా అయితే కృష్ణా, గుంటూరు లాంటి జిల్లాల్లో మాత్ర‌మే టీడీపీకి ఒక‌టీ అరా స్థానాలు వ‌స్తాయ‌ని చెప్పాయి. ఇక టీడీపీ నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు సైతం అస‌లు పోటీ చేయ‌క‌పోవ‌డ‌మే బెట‌ర్ అని.. పోటీ చేసి డ‌బ్బులు పోగొట్టుకోలేమ‌ని పార్టీ అధినాయ‌క‌త్వానికి సూచిస్తున్నా ఎవ్వ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు.



ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే బీసీ రిజర్వేష‌న్లు ఎంత‌లా అడ్డుకోవాలో అన్ని ప్ర‌య‌త్నాలు చేసి చేతులు ఎత్తేసిన బాబోరి ప‌చ్చ బ్యాచ్ జ‌గ‌న్ పార్టీ ప‌రంగా మ‌రో 10 శాతం రిజ‌ర్వేష‌న్లు బీసీల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించ‌డంతో ఇప్పుడు మ‌రో చెత్త ప్ర‌చారం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓటర్లకు జగనన్న బంపర్ ఆఫర్ ఇస్తున్నార‌ని.... ఇంటికే జగనన్న నోటు, మందు అందిస్తున్నార‌ని... 90 శాతం పంచాయ‌తీలు,మున్సిపాలిటీల్లో గెలుపే లక్ష్యంగా ఓటుకి 5 వేలు పంచాలని జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నార‌ని బాబోరి బ్యాచ్ సోష‌ల్ మీడియా గ్రూపులు ప్ర‌చారం చేస్తున్నాయి.



గ్రామ వాలంటీర్ల ద్వారా డబ్బు పంపిణీ చేయించేందుకు జ‌గ‌న్ ఇప్ప‌టికే ప్లాన్ వేశార‌ని... గ్రామాల్లో ఓటుకి 5 వేలు ,పట్టణాల్లో ఓటు కి 8 వేలు అయినా ఇచ్చి గెలవాలి అని వైకాపా నాయకత్వానికి జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశార‌ని బాబోరి ప‌చ్చ గ్రూపుల్లో మ్యాట‌ర్ వైర‌ల్ అవుతోంది. ఇక ఓట‌ర్ల‌కు కావాల్సిన మద్యం కూడా వాలంటీర్ల ద్వారా ఇంటికే అందించాలి.బహిరంగ ప్రదేశాల్లో మద్యం అందించకుండా వాలంటీర్ల మద్యం ఇంటికే పంపాలి అని జ‌గ‌న్ నిర్ణ‌యించార‌న్న దుష్ప్ర‌చారానికి కూడా టీడీపీ వాళ్లు తెగ‌బ‌డుతున్నారు. మ‌రి వీటిని వైసీపీ సోష‌ల్ మీడియా టీం ఎలా ? అడ్డుకుంటుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: