ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల రిజ‌ర్వేష‌న్లు రావ‌డంతో పాటు నోటిఫికేష‌న్ కూడా వ‌చ్చేయ‌డంతో రాజ‌కీయం ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టికే శాస‌న‌మండ‌లి ర‌ద్దుపై జ‌గ‌న్ బ‌లంగా నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఎవ్వ‌రికి ఎమ్మెల్సీ ఆశ‌లు లేవు. ఇక మిగిలింది అల్లా మునిసిప‌ల్ చైర్మ‌నో లేదా మేయ‌ర్ పీఠాలో లేదా జ‌డ్పీచైర్మ‌న్ ప‌ద‌వులో.... వీటికే కాస్త విలువ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఈ మూడు ప‌ద‌వులు కేబినెట్ ర్యాంక్ పోస్టులు కావ‌డంతో వీటికి మంచి డిమాండ్ ఏర్ప‌డింది. ఇక జ‌డ్పీ చైర్మ‌న్ పీఠం కోసం పోటీప‌డుతున్న వారి లిస్ట్ చాంతాడంత ఉంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ సొంత జిల్లా అయిన క‌డ‌ప‌లో జ‌డ్పీ పీఠం జ‌న‌ర‌ల్ కావ‌డంతో ఈ పోస్టు కోసం ఏకంగా ట్ర‌యాంగిల్ ఫైట్ న‌డుస్తోంది.



శాస‌న‌మండ‌లి ర‌ద్దు ప్ర‌క్రియ న‌డుస్తోంది. ఎమ్మెల్సీ సీటు ఆశ ఇక‌లేదు. అయితే మున్సిప‌ల్ ఛైర్మ‌న్ లేదా కార్పొరేష‌న్ మేయ‌ర్ లేదా జ‌డ్పీ ఛైర్మ‌న్‌… ఈ మూడు కూడా కేబినెట్ ర్యాంక్ పోస్టులే. దీంతో ఇప్పుడు వీటికి ఏపీలో భారీగా పోటీ ఏర్ప‌డింది. జ‌డ్పీ ఛైర్మ‌న్‌ సీటు కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. క‌డ‌ప జ‌డ్పీచైర్మ‌న్ సీటు జ‌న‌ర‌ల్‌కు రిజ‌ర్వ్ కావ‌డంతో రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమ‌ర్నాథ్‌రెడ్డి జ‌డ్పీ ఛైర్మ‌న్ రేసులో ముందు ఉన్నారు. ఇక ప్ర‌స్తుత ఎమ్మెల్యే మేడా మ‌ల్లిఖార్జున్ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌చ్చిన‌ప్పుడు అమ‌ర్నాథ్ రెడ్డి సీటు త్యాగం చేశారు.



అప్పుడే ఆయ‌న‌కు జ‌గ‌న్ ఎమ్మెల్సీపై హామీ ఇచ్చారు. ఇప్పుడు మండ‌లి ర‌ద్దు అవ్వ‌డంతో ఆయ‌న‌కు జ‌డ్పీచైర్మ‌న్ ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. జ‌గ‌న్‌కు ఆయ‌న‌కు హామీ ఇచ్చిన‌ట్టు కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక ఇదే ప‌ద‌విపై కమ‌లాపురం ఎమ్మెల్యే, జ‌గ‌న్ మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి కొడుకు రామాంజనేయులు రెడ్డి కూడా రేసులో ఉన్నార‌ట‌. ఆయ‌న జ‌గ‌న్‌కు బావ‌మ‌రిది అవుతారు. ఇక ఇదే ప‌ద‌విపై విజ‌యసాయి రెడ్డి బంధువు శివానంద‌రెడ్డి కూడా క‌న్నేశార‌ట‌. ఆయ‌న విజ‌య‌సాయి రెడ్డి ద్వారా ఈ ప‌ద‌వి ద‌క్కించుకోవాల‌ని చూస్తున్నారు. మ‌రి జ‌గ‌న్ తాను హామీ ఇచ్చిన అమ‌ర్నాథ్ రెడ్డికి ఈ ప‌ద‌వి ఇస్తారా ?  లేదా ?  బంధుత్వానికి బెండ్ అవుతారా ? అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: