నల్గొండ మిర్యాలగూడ లో గతంలో ప్రణయ్ పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అమృత తండ్రి మారుతీరావు ఓ వ్యక్తికి సుపారీ ఇచ్చి మరి హత్య చేయించినట్లు గా తేలడంతో ప్రధాన నిందితుడైన మారుతీరావు జైలు శిక్ష కూడా అనుభవించారు. అయితే ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. కాగా  మారుతీ రావు మృతదేహం వద్ద ఒక సూసైడ్ నోట్ కూడా లభించడం... అందులో గిరిజ నన్ను క్షమించు అమృత అమ్మ వద్దకు వెళ్లి పో అంటూ రాసి ఉంది. అయితే తాజాగా మారుతీ రావు అంత్యక్రియలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన అమృత ప్రణయ్... సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

 

 మా నాన్న మారుతిరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని... ఒక మనిషిని చంపిన వాడు ఆత్మహత్య చేసుకుంటాడు అని నేను అనుకోను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది అమృత. మా నాన్న బాబాయ్ మధ్య గొడవలు ఉన్నాయని... మా బాబాయ్ మా తండ్రిని రెండుసార్లు కొట్టినట్లు తెలిసింది అంటూ చెప్పుకొచ్చింది. కేవలం ఒత్తిడి కారణంగానే మా నాన్న చనిపోలేదని ఇంకా వేరే కారణాలు ఉండవచ్చని... అంటూ తెలిపింది అమృతం. జైలునుండి విడుదలైన తర్వాత తన తండ్రి తనను ఇంటికి తీసుకెళ్లేందుకు ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశారని... కానీ నేను మాత్రం ఎన్నిసార్లు పిలిచినా వెళ్లడానికి నిరాకరించాను  అంటూ చెప్పుకొచ్చింది. ప్రణయ్ ని చంపారు అని తప్ప మా మధ్య ఎలాంటి గొడవలు లేవని.. ఈ కేసులో చట్టపరంగా నాన్నకి శిక్ష పడాలని కోరుకుంటున్నాను... ఇలా చనిపోవాలని ఎప్పుడూ కోరుకోలేదు అంటూ అమృత తెలిపింది. 

 

 

మా తండ్రి ఆత్మహత్యకు బాబాయ్ నాన్న మధ్య ఉన్న ఆస్తి తగాదాలే కారణం కావచ్చు అంటూ అనుమానం వ్యక్తం చేసింది. భర్త చనిపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు అందుకే అమ్మను  ఓదార్చడానికి వెళ్లాను... ప్రణయ్ కుటుంబాన్ని వదిలేసి  మా అమ్మ దగ్గరకి వెళ్లే ప్రసక్తే లేదు... ఒకవేళ ఆమె నా  దగ్గరికి వస్తే బాధ్యత తీసుకుంటాను.. నా భర్త ప్రణయ్ చనిపోయినప్పుడే బలంగా ఉన్నాను ఇప్పుడు ఎందుకు ఉండలేను అంటూ తెలిపింది అమృత. అలాగే మారుతీరావు సూసైడ్ నోట్  చూశానని ఆ సూసైడ్ నోట్లో ఉన్నది నాన్న రైటింగె  అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: