ఈ నెలాఖరున జరగనున్న పంచాయితీ ఎన్నికలు   నేపథ్యంలో  వైసిపి  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభ౦ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర౦లోని రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. స్థానిక ఎన్నికలు రాష్ట్రంలో మళ్లీ వేడి రాజేస్తున్నాయన్నది తెలిసిన సంగతే. దీనిలో భాగంగా నేటి నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 27, 29 తేదీల్లో పోలింగ్,  రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే ఎన్నికల వేళ జగనన్న ప్రభుత్వం ప్రకటించిన ఒక ఆఫర్ అభ్యర్థుల్లో ఒకింత ఉత్సాహాన్ని పెంచుతుంది అనే చెప్పాలి. 

 

ఇంతకీ ఆ పథకం ఏమిటి అంటే  గ్రామాల్లోని సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైతే  ఆయా గ్రామాలకు భారీ బహుమతి అందివ్వనున్నారు. గ్రామ పంచాయితీ లో జనాభాను బట్టి ఆ గ్రామాలకు 5  లక్షల నుండి 20 లక్షల వరకు  ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించనున్నారు. ఇప్పటికే  పంచాయితీ రాజ్ శాఖ ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు  సమాచారం. అయితే దీని వెనుక జగన్ పెద్ద వ్యూహం ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తెలుగుదేశం పార్టీని మానసికంగా కూడా జగన్ ఈ విధంగా దెబ్బ కొట్టే అవకాశం ఉందని అంటున్నారు. 

 

వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు చాలా కీలకం. రాజకీయంగా బలపడాలి అంటే తమ పట్టుని క్షేత్ర స్థాయిలో నిలుపుకోవాలి అంటే మాత్రం ఈ ఎన్నికల్లో విజయం అనేది ఆ పార్టీకి చాలా కీలకం. ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు అనేక రకాల సూచనలు చేసారు. అయినా సరే జగన్ వ్యూహాల ముందు ఆయన తేలిపోతున్నారు. ఇప్పుడు ఏకగ్రీవం చేస్తే అంటూ ప్రకటించిన ఈ ఆఫర్ తెలుగుదేశం పార్టీకి మింగుడు పడటం లేదు. ఇప్పటికే మంత్రులు కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. మరి ఈ పరిస్థితి ఆ పార్టీ ఏ విధంగా అధిగమిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: