ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీమ రాజకీయాలు అంటే చాలా కీలకం. ఆధిపత్య పోరు గురించి వర్గాలు వర్గాలుగా విడిపోయి కత్తులు కటార్లు దాకా గెలుపుకోసం తమ రక్తాన్ని ధారపోస్తారు సీమవాసులు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అయితే ఇటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఇటువంటి నేపథ్యంలో అధికారంలో ఉన్న వైసిపి పార్టీ కర్నూలు జిల్లాలో ఈ విధమైన సరికొత్త సమస్య ఎదురయింది. మేటర్ లోకి వెళ్తే కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే యువ నాయకుడికి మరియు అదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఆర్ధ‌ర్ మధ్య తీవ్రమైన ఆధిపత్యపోరు ఏర్పడింది. ఇన్చార్జిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ నందికొట్కూరు మార్కెట్ కమిటీ పదవుల విషయంలో ఎస్సీ నాయకుడు అయిన ఎమ్మెల్యే ఆర్ధ‌ర్ నీ పక్కన పెట్టి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి అనుకూలంగా ఉన్న వర్గానికి అనుకూలంగా వ్యవహరించినట్లు వార్తలు రావడం జరిగింది.

 

దీంతో నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ పదవులు దక్కిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అభ్యర్థులకు కొద్దిగా తల వంచుకొని ఎమ్మెల్యే ఆర్ధ‌ర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వేదికపై ఆయన మాట్లాడుతూ ఎవరు ఎన్ని పార్టీలో చేసిన చివరాకరికి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలే శిరోధార్యమ‌ని ప్ర‌క‌టించారు. నందికొట్కూరు నియోజక వర్గంలో అవినీతి లేకుండా అభివృద్ధి పనులు జరుగుతున్నాయ‌ని, అయినా కొంద‌రు త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ప‌రోక్షంగా బైరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో త‌న అనుచరులకు మార్కెట్ కమిటీ పదవులు రాలేదని బాధగా ఉంద‌న్నారు. మనస్తాపాని కి గురైన మాట వాస్తవమేన‌న్నారు.

 

పదవులు అనేది కొందరికేన‌ని, అందరికీ రావని త‌న వారికి వివ‌రించిన‌ట్టు చెప్పారు. దీంతో ఎమ్మెల్యే ఆర్ధ‌ర్ వర్గానికి చెందిన దళిత నాయకులు పార్టీలో గొడవలు సృష్టించే విధంగా నియోజకవర్గంలో ఉన్న నాయకులు వ్యవహరిస్తున్న తీరును తప్పు పడుతున్నారు. ఈ విధంగానే భవిష్యత్తులో ముందుకు వెళితే పార్టీ రెండుగా చీలిపోయే అవకాశం ఉందని, ఆర్ధ‌ర్ వర్గానికి చెందిన వాళ్ళు మార్కెట్ కమిటీ పదవుల వ్యవహారంలో పార్టీ అనుసరించిన తీరు పట్ల తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: