మారుతీ రావు ఖైరతాబాద్ లో రూమ్ అద్దెకు తీసుకుని అందులో చనిపోయిన సంగతి తెలిసిందే.. ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. తర్వాత అమృత మీడియా ముందుకొచ్చి తన బాబాయి శ్రవణ్‌ ను టార్గెట్ గా చేసుకొని ఆయనపై పలు విమర్శలు గుప్పించారు. ప్రణయ్ హత్యకు ప్రేరేపించింది మా బాబాయే అని చెప్పుకొచ్చింది. శ్రవణ్ ప్రేరేపించడం వలనే మారుతీరావు ప్రణయ్‌ ను హత్య చేయించాడంటు ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబాయి శ్రవణ్ మారుతీరావు పై చేయి చేసుకున్నాడని, ఈ విషయం మిర్యాలగూడలో కూడా అందరికీ తెలుసని, కానీ... వారెవరు మాట్లాడారని వ్యాఖ్యానించారు.

 


శ్రవణ్ అంటే మారుతీరావు కి భయమని.. ఆయన శ్రవణ్ కు భయపడతాడని పేర్కొంది. బహుశా శ్రవణ్ ఒత్తిడి కారణంగానే మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. శ్రవణ్ అంటే కుటుంబసభ్యులందరికీ భయమని అన్నారు. అమృత విమర్శలకు  శ్రవణ్ సమాధానాలను ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ..  తనకు మారుతీరావు ఆస్తిలో ఒక్క పైస కూడా అవసరం లేదన్నారు. గత 30 సంవత్సరాలుగా మేము భూములు కొంటున్నామని అందరిలాగే మా భూములకు కూడా రేట్ పెరిగిందని పేర్కొన్నాడు.

 

 

మారుతీరావుకు బినామీ ఆస్తులు ఉన్నాయని అమృత    ఆరోపించింది. బినామీల పేరిట ఆస్తులు ఉన్నాయని అమృత చెబుతోంది. కానీ మారుతీరావు ఆయన మా కుటుంబీకులు నలుగుర్ని తప్పితే ఎవర్నీ నమ్మడు అని ఆయన తెలిపారు  తండ్రి చనిపోతే నేను ఆనందించానని నన్ను అంటున్నారు. మరి శ్రవణ్ ముఖంలో బాధ కనిపించిందా అని ఆమె ప్రశ్నించారు. శ్మశానానికి వెళ్లిన తనను శ్రవణ్ కూతురు నెట్టివేసిందన్నారు. అమృత తన తల్లికి ప్రాణ హాని ఉందని ఆమె తెలిపారు. మారుతీరావును తాను కొట్టానని అమృత చేసిన ఆరోపణలను శ్రవణ్ తీవ్రంగా ఖండించారు. తాను మారుతీ రావును కొట్టలేదు, తిట్టను కూడా తిట్టలేదన్నారు. మే 15 నుంచి ఇప్పటి వరకు  మారుతీరావుతో నేను మాట్లాడలేదని శ్రవణ్ మీడియాకు చెప్పారు.

 


అమృతకు మెచ్యూరిటీ లేదని శ్రవణ్ అన్నారు. మారుతీరావు మరణవార్త నాకు శుభవార్త అని అమృత అందన్నారు. అసలు సంప్రదాయ ప్రకారం భర్త చనిపోయాక తాళి తీయాలి కానీ.. మారుతీరావు భార్య తాళి తీసిన రోజే నేను తీస్తానని అమృత వ్యాఖ్యానించిందని శ్రవణ్ ఆరోపించారు. అలాంటిది ఆమెకు ఇప్పుడు మారుతీరావు మీద, ఆయన భార్య మీద ప్రేమ ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఆస్తి కోసం అన్ని డ్రామాలు వేస్తోందని అసలు నాన్న మీద ప్రేమ ఉంటే నిన్నే రావచ్చు కదా అని, అసలు ఆమెకు ప్రేమ ఉంటే ఆయన చనిపోవాలని ఎందుకు కోరుకుంటుందని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: