శృంగారం అనేది ఒకరి మీద మరొకరికి ఇష్టంతో జరిగే ఒక ప్రక్రియ.. అయితే అది ఏకాంతంగా గడపాల్సిన పని.. అలాంటిది నలుగురిలో గొప్పగా చేస్తే ఇలా ఉంటుందో ఒక సారి ఊహించుకోండి. ఛండాలంగా ఉంది కదా అదే ఇప్పుడు కూడా జరిగింది. అందుకే రహస్యంగా చేయాల్సిన పనిని పాల్బలిక్ లో పెట్టకూడదని అందరు అంటున్న కూడా ఓ జంట వినకుండా పబ్లిక్ బీచ్లో సెక్స్ చేశారు పోలీసులకు అడ్డంగా దొరికారు. 

 

 


వివరాల్లోకి వెళితే.. థాయిలాండ్‌ పర్యాటక ప్రాంతాలు చూసేందుకు వచ్చిన రష్యన్ జంట బీచ్‌లోనూ అందరిముందూ సెక్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయి చిక్కుల్లో పడింది. సరదాగా ప్రకృతిని ఎంజాయ్ చేద్దామా, మనశాంతి కోరుకున్నామా అని ఉండకుండా రష్యా జంట ఏకంగా బీచ్లో బట్టలు తీయి మరి సిగ్గులేకుండా ప్రవర్తించారు. ఆ  విషయాన్ని కొందరేమో కళ్ళు తిప్పుకోకుండా చూస్తే.. మరి కొందరేమో తిట్టిపోశారు. 

 

 


రష్యాకు చెందిన రోమన్ గ్రిగోరెంకో అనే యువకుడు తన ప్రేయసి దరియా వినోగ్రాడోవాతో కలిసి థాయిలాండ్‌కు చూసేందుకు వచ్చాడు. శనివారం వారిద్దరూ ప్రఖ్యాత పట్టాయా బీచ్‌ను సందర్శించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బీచ్‌లో పర్యాటకుల రద్దీ తక్కువగా ఉంది. అదే అదనుగా భావించిన వారిద్దరూ దుస్తులన్నీ విప్పేసి సముద్రపు ఒడ్డున సెక్స్ చేయడం ప్రారంభించారు. మిగిలిన పర్యాటకులు వారి చేసిన పాడుపనిని చూసి చీధరించుకుని వెళ్లిపోగా.. కొందరేమో ఆ బాగోతాన్ని కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు.

 

 


కొందరు పర్యాటకులు ఈ దుస్థితిని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారు మద్యం మత్తులోనే ఇలా చేసినట్లు గుర్తించారు. నిబంధనలను అతిక్రమించిన నేరానికి వారికి రూ.12వేలు జరిమానాగా విధించారు. థాయిలాండ్‌ బీచ్‌ల్లో నగ్నంగా తిరగడం, బహిరంగంగా సెక్స్ చేసుకోవడం నిషేధం.. అని గట్టిగా వారిని హెచ్చరించారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: