అవును వీళ్ళద్దరికీ టైం భలే కలిసొచ్చింది. లేకపోతే ఇద్దరు బిసి నేతలకు ఒకేసారి రాజ్యసభ ఎంపిలుగా సెలక్ట్ చేయటమంటే మామూలు విషయం కాదు. పైగా ఇద్దరు తమ నియోజకవర్గాల్లో జనాల చేతిలో తిరస్కరణకు గురైన వారే. అదృష్టం వీళ్ళద్దరినీ దరిద్రం పట్టుకున్నట్లు పట్టుకోవటం వల్ల ఇద్దరికీ పదవులు ఒళ్ళో వచ్చి వాలుతున్నాయనే అనుకోవాలి. లేకపోతే పార్టీలో ఎంతమంది గట్టి నేతలు చాలామందే ఉండగా వీళ్ళద్దరినే పదవులు ఎందుకు వరిస్తున్నాయి ?

 

ఇంతకీ విషయం ఏమిటంటే వైసిపి నుండి రాజ్యసభకు సెలక్టయిన నలుగురు నేతల్లో ఇద్దరు మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. మూడో వ్యక్తి పారిశ్రామికవేత్త అయోధ్య రామిరెడ్డి. ఇక నాలుగో వ్యక్తి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడు పరిమళ్ ధీరజ్ నత్వానీగా జగన్ ఎంపిక చేశాడు. నత్వానీ ఎంపిక ఖాయమని ముఖేష్ భేటితోనే అందరికీ తెలిసిపోయింది. కాకపోతే మిగిలిన మూడు స్ధానాల్లోనే ఎవరిని ఎంపిక చేస్తారన్నదే కాస్త సస్పెన్సులో పడింది.

 

నిజానికి అయోధ్యరెడ్డి పేరు కూడా బాగా ప్రచారంలో ఉంది. దానికి తోడు రెడ్డి రెండు రోజుల క్రితమే రాజ్యసభ ఎంపిగా నామినేషన్ వేయటానికి దరఖాస్తును కూడా తీసుకున్నారు. దాంతో ఒకస్ధానం అయోధ్యకు ఖాయమైపోయిందని తేలిపోయింది. మిగిలిన రెండు స్ధానాలపైనే టెన్షన్ మొదలైంది. అయితే చివరకు జగన్ ఇద్దరు మంత్రుల పేర్లను ఫైనల్ చేయటంతో  ఉత్కంఠకు తెరపడింది.

 

మొన్నటి ఎన్నికల్లో మంత్రి మోపిదేవి వెంకటరమణ గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో ఓడిపోయాడు. అయినా మంత్రిని చేసి శాసనమండలికి పంపారు. ఇక పిల్లి విషయం చూస్తే ఇప్పటికే కౌన్సిల్ మెంబర్ కూడా అయినప్పటికీ మొన్నటి ఎన్నికల్లో పోటి చేసి ఓడిపోయాడు. అంటే ఇద్దరూ ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రివర్గంలో చేరిపోయారు. ఎంత అదృష్టం ఉంటే ఇలా జరుగుతుంది ? ఇద్దరు బిసిలవ్వటమే వీళ్ళకు కలిసి వచ్చింది. ఇపుడు కూడా ఇద్దరిని ఎంపిక చేయటంలో ప్లాన్ ఏమిటంటే స్ధానిక సంస్ధల ఎన్నికల సందర్భంగా బిసిల రిజర్వేషన్ పై రచ్చ జరుగుతుండటమే అయ్యుంటుంది. మొత్తానికి ఇద్దరికీ టైం మాత్రం భలే కలిసొస్తోందే.

మరింత సమాచారం తెలుసుకోండి: