పెళ్లామంటే పరువు నిలబెట్టేది పరువు తీసేది కాదు.. కానీ ఈ మధ్యకాలంలో పెళ్లి కున్న విలువలు మారిపోయాయి.. అసలు భార్య భర్తల మధ్య నమ్మకం అనే పునాది బలంగా ఉండటం లేదు.. ఇకపోతే ఎవరు ఎవరిని మోసం చేస్తారో అనే భయం కూడా పుట్టుకొస్తుంది.. ఒక అమ్మాయి పెళ్లిపేరుతో మోసం చేసిన తీరు, వివాహా వ్యవస్దనే అవమానపరిచే విధంగా ఉంది.. ఆ వివరాలు తెలుసుకుంటే..

 

 

మధ్యప్రదేశ్‌లోని, ఉదయపూర్ జిల్లాలో ఉన్న కురాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని గుడ్లీ గ్రామానికి చెందిన ముఖేష్ సేథియాకు, ఇండోర్‌కు చెందిన స్వప్న మిశ్రాతో పెళ్లిళ్ల బ్రోకర్‌ ద్వారా పరిచయం ఏర్పడ్డది.. ఆ నాటి నుండి స్వప్నపై మనసు పారేసుకున్న ముఖేశ్, ఎలాగైనా తననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండానే మరీ ఎదురుకట్నంగా రూ.5లక్షలు ఇచ్చి వివాహం చేసుకున్నాడు.. అలా వారి పెళ్లి జరిగిన మూడు నెలల తర్వాత స్వప్న అకస్మాత్తుగా మాయం అయ్యింది..

 

 

దీంతో ముఖేశ్ కంగారుపడి తనకు తెలిసిన అన్నిచోట్ల వెతికిన లాభం లేక పోవడంతో, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయగా, ఆ భర్తతో పాటుగా, పోలీసులకు షాకిచ్చే విషయాలు బయటపడ్డాయి. అదేమంటే ఆ యువతి ఓ ముఠా సభ్యురాలని, ధనవంతుల కొడుకులకు వలవేసి పెళ్లి చేసుకుని సొమ్ము దోచుకుని పారిపోతుంటుందని వెల్లడైంది. గతంలోనూ ఆ ముఠా అనేక మందిని ఇలాగే మోసం చేసినట్లు పోలీసులు చెప్పడంతో ముఖేశ్‌ షాక్‌లోకి వెళ్లిపోయాడు..

 

 

ఇకపోతే ఇతనికి పెళ్లి జరిగిన రోజు నుండి ఆమెతో ఎలాంటి బెడ్ రిలేషన్ ఏర్పడలేదని, కోరికతో దగ్గరకు వెళ్లిన ప్రతిసారీ ఏదొక కారణం చెప్పి తప్పించుకునేదని పోలీసులకు తెలియచేసాడు... ఇక తన జీవితంతో పాటుగా, పరువును తీయడమే కాకుండా, తన ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదును కూడా ఆ కిలేడీ దోచుకుపోయిందని లబోదిబో మంటున్నాడు.. అందుకే లోకంలో అన్ని విషయల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన నిరూపిస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: