కరోనా వైరస్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచంలో మానవ జాతి మనుగడకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని అంతర్జాతీయ వైద్య నిపుణులు కామెంట్ చేస్తున్నారు. దీంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించింది. చైనాలో పుట్టిన ఈ వైరస్ దాదాపు 90 వేల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పటికే మూడు వేల మందికి పైగానే చనిపోవడం జరిగింది. దీంతో చైనా వ్యూహన్ నగరంలో బయటపడిన ఈ వ్యాధికి ప్రపంచం మొత్తం గజగజలాడుతోంది. యూరప్ మరియు అన్ని ఖండాలకు ఈ వైరస్ సోకింది. దీంతో ప్రపంచంలో భూమిమీద ప్రభుత్వాలు చేస్తున్న అధికారులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ క్యాబినెట్ లో ఇద్దరు అధికారులకు ఈ వ్యాధి సోకినట్లు తేలడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మనిషిలో ఆందోళన ఎక్కువ అయ్యింది.

 

ప్రపంచం మొత్తం ఎప్పుడూ కరోనా వైరస్ పేరు చెబితే వణికిపోతోంది. ఇరాన్, ఇటలీలలో ఆదివారం ఒక్క రోజే దాదాపు 135 మంది మృతిచెందారు. ఇరాన్ లో మొత్తం మృతుల సంఖ్య 237కు చేరింది. మరో 7వేల మందికి పైగా ఈ వైరస్‌ బారినపడి చికిత్స పొందుతున్నారు.కోవిద్ 19 వైరస్ చైనాతో పాటు ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాలో మరణమృదంగం మోగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ లోని పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న దాదాపు 70వేల మంది ఖైదీలను విడుదల చేసింది.

 

ఈ విషయాన్ని ఇరానియన్‌ జ్యుడీషియరీ చీఫ్‌ ఇబ్రహీం రైసీ వెల్లడించినట్టు తెలుస్తోంది. ఖైదీలను విడుదల చేస్తూ తీసుకున్న నిర్ణయంతో సమాజంలో ఎలాంటి అభద్రతా భావం కలగదని ఆయన వ్యాఖ్యానించారు. కానీ జైలు నుండి విడుదలైన వాళ్ళు మళ్లీ జైలు కి రావాలో వద్దో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఒక్కసారిగా ఇరాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఖైదీల లో సంతోషం నెలకొంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: