ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితం అంతా ఎంతో మందికి ఎన్నోసార్లు మాట ఇవ్వ‌డం త‌ప్ప‌డ‌మే జ‌రుగుతూ వ‌చ్చింది. చంద్ర‌బాబు మాట‌లు నీటి మీద రాత‌లుగానే మిగిలిపోయాయి. ఆయ‌న పాల‌న‌లో ఎంతో మంది నేత‌ల‌కు ఎన్నో హామీలు ఇచ్చారు. ఆయ‌న మాట ఇస్తే న‌మ్మ‌కం ఉండ‌ద‌ని చెప్పేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. జీవితం అంతా ఆయ‌న‌కు ఊడిగం చేసిన వాళ్లకు సైతం చంద్ర‌బాబు చిప్ప చేతికి ఇచ్చి పంపారు. సీనియ‌ర్ న‌టి క‌విత నుంచి ఎంతో మంది ఆయ‌న‌కు జీవితాంతం ప‌నిచేసినా ప‌ట్టించుకోలేదు. అయితే జ‌గ‌న్ మాట ఇచ్చిన మ‌రు క్ష‌ణానికే ఎంతో మందికి ప‌ద‌వులు ఇచ్చారు.


దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త, రాజ్య‌స‌భ స‌భ్యుడు పరిమల్‌ నత్వానికి ఏపీ నుంచి వైసీపీ కోటాలో రాజ్య‌స‌భ అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ త‌న స‌న్నిహితుడు అయిన న‌త్వానికి రాజ్య‌స‌భ సీటు కోసం జ‌గ‌న్‌ను క‌లిసిన సంగ‌తి తెలిసిందే. వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయి రెడ్డి దౌత్యంతో అంబానీ జ‌గ‌న్‌ను క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశంలో జ‌గ‌న్ న‌త్వానికి రాజ్య‌స‌భ ఇస్తాన‌ని హామీ ఇచ్చారో లేదో తాజాగా ఈ రోజు ఆయ‌న్ను రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.



జ‌గ‌న్ త‌న‌కు ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవ‌డంతో న‌త్వానికి సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు.  ‘ఏపీ ప్రజలకు ధన్యవాదాలు. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సేవ చేస్తాను’ అని పోస్ట్‌ చేశారు. పరిమల్ నత్వానీ ప్రస్తుతం జార్ఖండ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్వరలో అయన రాజ్యసభ పదవీకాలం పూర్తవుకానుంది. ఇక ఏపీలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు కృషి చేస్తాన‌ని.. రాష్ట్ర  అభివృద్ధికి కృషి చేస్తాన‌ని కూడా ఆయ‌న భ‌రోసా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: