టిఆర్ఎస్ పార్టీలో కెసిఆర్ మరియు కేటీఆర్ తర్వాత ఎక్కువగా వినిపించే పేరు హరీష్ రావు. 2014 ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు పేరు మారుమ్రోగింది. దీంతో చాలా వరకు రాజకీయ నేతలు రాష్ట్రంలో కెసిఆర్ తర్వాత హరీష్ రావు అని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో పార్టీలో నెంబర్ టూ స్థానం కోసం కేటీఆర్ మరియు హరీష్ రావు మధ్య తీవ్ర మనస్పర్ధలు కూడా చోటు చేసుకున్నట్లు అప్పట్లో తెలంగాణ మీడియా లో వార్తలు రావడం జరిగింది. 2014 సంవత్సరంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు 2019 ఎన్నికల్లో తెలంగాణ నాయకులలో ఎవరికీ రాని భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది.

 

అయితే ఈసారి మాత్రం చాలా సైలెంట్ అయిపోయారు. తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ గా రాణిస్తున్న హరీష్ రావు ఆలోచనా ధోరణి మరియు వ్యక్తిత్వం చాలా వెరైటీ గా ఉంటుంది. ఉద్యమ నాయకుడిగా మంచి పేరు సంపాదించారో, సిద్దిపేట నియోజకవర్గంలో అదే స్థాయిలో పేరు సంపాదించారు. ఎంత మంత్రి పదవిలో ఉన్నా గాని నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి ఎటువంటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే దిశగా సిద్దిపేటలో పరిపాలన వ్యవస్థ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక విషయంలోకి వెళితే ఇటీవల హరీష్ రావు చేసిన ఓ పనికి కెసిఆర్ చాలా కాలం తర్వాత శభాష్ అని మెచ్చుకున్నారు. మేటర్ లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

 

కాగా సోమవారం ఉదయం హరీష్ రావు తన నియోజకవర్గం సిద్దిపేటలో ప్రత్యక్షమయ్యారు. సిద్ధిపేటలోని 33, 34 మున్సిపల్ వార్డుల్లో తిరిగిన ఆయన… వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు. పట్టణంలో మార్నింగ్ వాక్‌కి వెళ్ళారు హరీష్. అక్కడ ఇంటింటికీ తిరిగారు. తడి, పొడి చెత్తలను వేర్వేరుగా చేసి ఇవ్వాలని 5 మున్సిపల్ వార్డుల్లో ప్రజలకు అవగాహన కల్పించారు వారితో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పొడి చెత్తను రీసైక్లింగ్ చెయ్యవచ్చనీ, అందువల్ల తడి, పొడి చెత్తలను వేర్వేరుగా ఉంచాలని సూచించారు. సిద్దిపేట ప్రజలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. మంత్రి స్థానంలో ఉండే ఇంత పొద్దున్నే వచ్చి సమస్యలు తెలుసుకున్నాడు అంటూ ప్రజలు ఉబ్బి తబ్బిబ్బు అయ్యారు. ఈ విషయం తెలుసుకొని కెసిఆర్ కూడా హరీష్ రావు నీ మెచ్చుకున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: