టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు... మాస్టర్ మైండ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాలలో  సక్సెస్ ఫుల్  రాణిస్తు  వస్తున్నారు. ఏకంగా కాంగ్రెస్ కంచుకోట లను సైతం బద్దలు కొడుతూ... ఎన్నో ఏళ్ల పాటు ఎత్తులు పైఎత్తులు వ్యూహాలు ప్రణాళికలతో ఎన్నోసార్లు అధికారాన్ని చేపట్టి ముందుకు సాగారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చంద్రబాబు మాత్రం తన మాస్టర్ మైండ్ వ్యూహాలతో రాజకీయాల్లో దూసుకుపోయారు. ఏకంగా కేంద్ర రాజకీయాలను కూడా ఎంతగానో ప్రభావితం చేసి ఇప్పుడు వరకు ఏర్పడిన థర్డ్ ఫ్రంట్ అన్నింటికి చంద్రబాబు ఆధిపత్యం వహించారు.

 


 కేవలం కొన్ని సంవత్సరాల పాటు మాత్రమే ఎత్తులు పైఎత్తులు వేస్తే  సరిపోదు ప్రతిక్షణం ప్రతి నిమిషం రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు వేయాల్సి ఉంటుంది.  కానీ ఈ సారీ  చంద్రబాబు కాస్త లేటు గానే  స్పందించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొన్ని రోజుల్లో ఎన్నికలు రానున్న విషయం తెలిసిందే. కాగా  ఈ ఎన్నికల విషయంలో టిడిపి అధికార వైసిపి పార్టీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతూ తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే హైకోర్టు రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు అని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. బీసీ ఓటు బ్యాంకు దెబ్బతినకుండా ఉండేందుకు మేమే  అదనపు రిజర్వేషన్ ని ఇస్తాము  అంటూ జగన్ సర్కార్ ప్రకటించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో  బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ప్రకటించినది. 

 


 అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత చంద్రబాబు కూడా ఇదే తరహా ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు జగన్ ను కాపీ కొట్టారని... బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ని చంద్రబాబు ముందే ప్రకటించి ఉంటే .. అధికార వైసిపి పార్టీని కాస్త ఇరకాటంలో పెట్టి నట్లు అయ్యేది అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం అధికార పార్టీ ప్రకటించినట్టుగానే ప్రతిపక్ష టిడిపి పార్టీ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ప్రకటించినప్పటికీ ముందుగా వైసీపీ పార్టీ ప్రకటించాక టిడిపి పార్టీ ప్రకటించడంతో... వైసిపి చేసిన ప్రకటనను టిడిపి కూడా కాపీ కొట్టినట్లు అయింది. ఈ నిర్ణయం విషయంలో చంద్రబాబు కాస్త లేట్ గానే స్పందించారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: