రాజకీయం అంటేనే ఎన్నో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. రాజకీయం అంటేనే ఒక చదరంగం. ఎత్తులు పైఎత్తులు వేయాల్సిందే.. ప్రత్యర్థి పార్టీలకు అర్థంకాని వ్యూహాలను అమలు చేయాల్సిందే.. లేనిపక్షంలో బొక్క బోర్లా పడి పోవాల్సి వస్తుంది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇలాంటిదే జరుగుతోంది. త్వరలో ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నో వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ముందుగా ఈ పోటీ అధికార వైసిపి ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య ఎక్కువగా ఉంది. ఇక ఈ రెండు పార్టీలు బీసీల రిజర్వేషన్లు పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. అయితే మామూలుగా బీసీలకు రిజర్వేషన్లు 34% అనే విషయాన్ని అటు అధికార వైసిపి పార్టీ తో పాటు మరోవైపు ప్రతిపక్ష టీడీపీ పార్టీ కూడా ప్రకటించింది. 

 

 వాస్తవంగా మొత్తం రిజర్వేషన్లు కలిపి 50 శాతం దాటొద్దు అని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. బీసీలకు అదనపు తొమ్మిదిన్నర  శాతం మేమే ఇస్తామంటూ అటు టిడిపి అధికార వైసిపి పార్టీలు ప్రకటించాయి. దీంతో బీసీలకు మొత్తం 34 శాతం రిజర్వేషన్లు దక్కాయి. దీంతో బీసీ లందరూ తమకు మొత్తం 50 శాతం రిజర్వేషన్లు 34 శాతం తమకు వస్తుందని ఆనందపడతారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే.. బీసీల కోటాలో కొంతమంది మైనారిటీలు కూడా ఉంటారు అన్న విషయం. మరి ఆ మైనార్టీ ఎవరు అంటే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అయిన  కొంత మంది ప్రతినిధులు. 

 

 ఇది ప్రస్తుతం బిసి రిజర్వేషన్లలో అత్యంత కీలకమైన అంశం. మొత్తంగా బీసీ రిజర్వేషన్లకు 34 శాతం ఉంది . అంటే మతపరమైన రిజర్వేషన్లకు ఒకప్పుడు కోర్టు కొట్టివేయడం తో ముస్లింలు కాకుండా ముస్లిం లోని కొంతమంది అంటే అత్తరు సాయబు,  పీర్ సాయిబు ఇలాంటి కొన్ని వర్గాలను అంటే వీళ్లు హిందూ కన్వర్ట్ ముస్లింలు అన్నమాట. అంటే వీరిని అటు ముస్లింలు తమ వారి కింద చూడరూ... ఇటూ  హిందువులు కూడా తమ వారి కింద చూడరు. అయితే ప్రస్తుతం కేటాయించిన బీసీ రిజర్వేషన్ లలో  వీరికి కూడా కొంతమేర రిజర్వేషన్ కేటాయించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం బిసి రిజర్వేషన్ లోనే కొనసాగుతున్న వీరికి.. మామూలు బీసీలు అంగీకరిస్తే ఎలాంటి కాంట్రవర్సీ ఉండదు. మరి బీసీలు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: