సంతోషంగా సాగుతున్న కుటుంబంలోకి ఒక హంతకుడు వచ్చి కళ్లముందే అయిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపుతుంటే, వాన్ని ఏం చేయలేక దిక్కుతోచని స్థితిలో ఆ దేవుని వైపు చూస్తూ.. అయ్యో దేవుడా ఇలాంటి ఘోరాలను చూడడానికా ఇంకా బ్రతికి ఉన్నదని దీనంగా రోదిస్తారు.. ఇక ఇక్కడ కరుడు కట్టిన హంతకుడు ఎవరంటే జాలిలేని కరోనా వైరస్..

 

 

దీన్ని పుట్టించిన వాడికే దయలేదు.. ఇక దీనికెక్కడ ఉంటుంది జాలి, దయ.. ఇప్పుడు ఈ వైరస్ ప్రపంచాన్నే శవాల గుట్టలుగా మార్చడానికి సిద్దం అయినట్లుగా ఉంది.. అందుకే ఈ మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. అందువల్ల రోజురోజుకూ మృతులు, బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

 

 

ఇదిలా ఉండగా ఈ వైరస్ బారినపడిన ఇటలీలో దారుణ పరిస్దితులు నెలకొన్నాయి.. అందువల్ల ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్దపడింది.. ఈ క్రమంలో దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలను నిర్బంధం చేశారు అధికారులు.

 

 

ముఖ్యంగా ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న లాంబార్డీ ప్రాంతంలో అయితే జనజీవనం పూర్తిగా స్తంభించింది. అత్యవసరమైన పరిస్థితులలోనే ప్రజలు బయటికి రావాలని.. ఎవరైనా సరే ఈ రూల్‌ను ఉల్లంఘిస్తే మూడు నెలల జైలు శిక్ష.. లేదా 206 యూరోల జరిమానా విధిస్తామని అక్కడి ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

 

 

కాగా అందమైన ఈ ప్రదేశం ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల అల్లకల్లోలంగా మారింది. ఇక్కడ ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి 366 మంది చనిపోగా.. సుమారు 7375 మంది బాధితులుగా మారారు. కాగా, మరోవైపు భారత్‌లో కూడా వైరస్ విజృంభి స్తోందని చెప్పాలి. ఎందుకంటే ఈ కరోనా బారిన పడిన వారి సంఖ్య ఇప్పటికే 43కి చేరిన సంగతి తెలిసిందే.. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: