మిర్యాల గూడ మారుతీ రావు ఆత్మహత్య తర్వాత కూడా ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. మిర్యాల గూడలో మారుతీ రావు అంత్యక్రియలు జరిగాయి. తండ్రిని చివరి చూపు చూసేందుకు ఆయన కూతురు అమృత అక్కడకు వెళ్లినా.. ఆమె బంధువులు చూడకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత అమృత ప్రెస్‌ మీట్ పెట్టింది. విలేఖరులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.

 

 

అందులో తన తండ్రికి బినామీ ఆస్తులు ఉండొచ్చని.. వాటి కోసం తన బాబాయి శ్రవణ్ తండ్రిపై ఒత్తిడి తెచ్చి ఉండొచ్చని చెప్పింది. అయితే అమృత ప్రెస్ మీట్ పెట్టి బాబాయిపై ఆరోపణలు చేసిన విషయం తెలుసుకున్న తర్వాత ఆమె బాబాయ్ కూడా మీడియా ముందుకు వచ్చారు. అమృతపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

 

 

మారుతీరావు సోదరుడు శ్రావణ్ పై మారుతీరావు కుమార్తె అమృత ఆరోపణలు చేస్తే, శ్రావణ్ అందుకు ప్రతిగా ఆరోపణలు చేశారు. అమృత చేసిన చెత్త పని వల్లే ఇన్ని దారుణాలు జరిగాయని అమృత బాబాయి శ్రావణ్ అన్నారు. తండ్రి చనిపోతే శుభవార్త అని అమృత అందని అమృత బాబాయి శ్రావణ్ ఆరోపించారు. ఇప్పుడు డబ్బు కోసమే అమృత నాటకాలు ఆడుతోందని అమృత బాబాయి శ్రావణ్ విమర్శించారు.

 

 

అంతే కాదు.. తనను ప్రణయ్ హత్య కేసులో అన్యాయంగా ఇరికించారని అమృత బాబాయి శ్రావణ్ ఆరోపించారు. తండ్రిపై అభిమానం ఉంటే నిన్ననే ఎందుకు ఇంటికి రాలేదని శ్రావణ్ ప్రశ్నించారు. తండ్రి చావాలని ఆమె కోరుకుందని అమృత బాబాయి శ్రావణ్ అంటున్నారు. అయితే తన తండ్రి ఆస్తిపై తనకు ఏమాత్రం ఆసక్తి లేదని అమృత ప్రకటించింది. తన తల్లి తన వద్దకు వస్తే.. ఆమెను జాగ్రత్తగా చూసుకుంటానని అంటోంది అమృత.

మరింత సమాచారం తెలుసుకోండి: