జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరచుగా ఏదో ఒక ఇబ్బందులు ఎదుర్కొంటూనే వస్తున్నాడు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా పార్టీ ఓటమి చెందడంతో, పవన్ రాజకీయ విమర్శలు ఎన్నో ఎదుర్కోవలసి వచ్చింది. ఇక ఐదేళ్ల పాటు పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లే విషయంలో పవన్ చాలా తర్జనభర్జనలు పడ్డాడు. ఒంటరిగా తాను పార్టీని ముందుకు తీసుకెళ్లలేనని, దీనికి సామాజిక ఆర్థిక పరిస్థితులు కూడా అవరోధాలు గా మారుతాయి అని భావించే బిజెపితో తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి ఆ పార్టీ చెప్పు చేతల్లోనే పవన్ ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల హడావిడి ప్రారంభమైంది. అన్ని పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

IHG

 

ఈ రేసులో జనసేన, బీజేపీ కూడా కలిసికట్టుగా ముందుకు దూకాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవాలని చూస్తున్నాయి. దీనికోసం బిజెపి జాతీయ స్థాయి నాయకులను రంగంలోకి దించి ప్రచారం చేయించాలని ముందుగా నిర్ణయించుకున్నాయి. అయితే బిజెపి తరఫున ఏ జాతీయ స్థాయి నేత వచ్చినా ఏపీ లో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అంతగా ప్రయోజనం ఉండదనే భావంతో ఆ పార్టీ నేతలు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ బిజెపి పెద్దలు మాత్రం ఏపీలో పవన్ తోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేయించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

 

IHG


ఈ మేరకు పవన్ పై ఒత్తిడి పెంచే అవకాశం కూడా కనిపిస్తోంది. అదే జరిగితే మరోసారి ఏపీలో పవన్ ఇమేజ్ డామేజ్ అయ్యే పరిస్థితి తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఘోరంగా దెబ్బతింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే గ్రామ స్థాయిలో మంచి పట్టు ఉండాలి. కానీ ఆ విషయాల్లో జనసేన, బిజెపి రెండు పార్టీలు బలహీనంగానే ఉన్నాయి. పవన్ ప్రచారం చేసినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేకపోవడంతో పవన్ పర్యటన చేయకపోవడమే మంచిదని జనసేన పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. 

 

కానీ బిజెపి పెద్దలు పవన్ పై ఒత్తిడి తెస్తే ఆయన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం చేసేందుకు ముందుకు దూకుతారు. అంతిమంగా ఈ వ్యవహారంలో నష్టపోయేది పవన్ మాత్రమే అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి పవన్ దీనిపై ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: