ఒకే కత్తులు రెండు వరల్లో ఇమడ లేవు అనేది ఎంత నిజమో, ఇద్దరు అగ్ర నేతల మధ్య ఉన్న రాజకీయ వైరం కూడా ఉంటుంది. పైకి కలిసినట్టుగా చేతులు కలుపుకున్నా, తెరవెనుక మాత్రం ఒకరి వెనుక మరొకరు గోతులు తీసుకుంటూ, తమ రాజకీయ ఎదుగుదలకు ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకుంటారు. ఆ విధంగానే ఇప్పుడు విశాఖ జిల్లాలో తెలుగుదేశం మాజీ మంత్రులు ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో ఆధిపత్య పోరు నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిలో రాజకీయ పార్టీల నాయకులంతా ఉండగా గంటా శ్రీనివాసరావు మాత్రం మొదటి నుంచి భిన్నమైన వైకిరిని, నిర్లక్ష్య వైఖరిని ఇప్పుడు కూడా అవలంబిస్తున్నారు. ఎన్నికలకు ముందే గంటా పార్టీ మారుతారు అనే ప్రచారం జరిగినా గంటాను చేర్చుకునేందుకు ఏ పార్టీ ముందుకు రాకపోవడంతో టిడిపి తరఫున ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. 

 

IHG

ఇక ఆ తరువాత నుంచి పార్టీ మారాలని చాలాసార్లు ప్రయత్నించినా, అది కూడా వర్కవుట్ అవ్వలేదు. దీంతో అయిష్టంగానే టిడిపిలో గంటా ఉంటున్నారు. కొద్ది రోజులుగా ఆయన టిడిపిలో యాక్టివ్ గా ఉంటూ వైసీపీ ప్రభుత్వం పై  విమర్శలు కూడా చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా, టిడిపి నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తో గంటా శ్రీనివాసరావుకు మొదటి నుంచి రాజకీయ వైరం ఉంది. టీడీపీ అధికారంలో ఉండగా వీరు బహిరంగంగా ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకోవడంతో చంద్రబాబు వీరిద్దరికీ సర్దుబాటు చేసి విశాఖ సిటీ ని గంటా శ్రీనివాసరావు, విశాఖ రూరల్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చూసుకో వలసిందిగా వీరిద్దరి మధ్య సెటిల్మెంట్ చేశారు. ఇక అప్పటి నుంచి ఆ విధంగానే జరుగుతున్నా, ప్రస్తుతం అయ్యన్నపాత్రుడు సిటీ పరిధిలోకి వచ్చి మరి హడావుడి చేస్తుండటంతో వీరిద్దరి మధ్య వివాదాలు మొదలవుతాయని అందరూ భావించారు.


 కానీ గంటా మాత్రం మౌనంగానే ఉంటున్నారు. దీనికి కారణం ఎలాగూ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది కాబట్టి, ఇప్పుడు ఎంత గట్టిగా ప్రచారం చేసినా, ఎంత సొమ్ములు ఖర్చు పెట్టినా ఫలితం ఉండదని, అలాగే ఈ ఎన్నికల బాధ్యతలు కనుక తీసుకుంటే ఓటమి ప్రభావం పడుతుందని , ప్రస్తుతం చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ వ్యవహారం చూస్తుండడంతో వాటి చేదు ఫలితాలు కూడా ఆయనపైనే పడతాయని గంటా ఆలోచనగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: