రంగు రంగుల హోలీ అంటే మనకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. పిల్లల నుండి పెద్దల వరుకు ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ పండుగ కోసం సంవత్సరం అంత ఎదురు చూస్తారు. అలాంటి ఈ పండుగను జరుపుకోనివ్వకుండా అడ్డుపడింది కరోనా వైరస్.. 

 

IHG

 

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ కరోనా వైరస్ ప్రస్తుతం భారతీయులను అష్టకష్టాలకు గురి చేస్తుంది. చైనాలోని వుహాన్ అనే నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ఇప్పటికే వేలమంది ప్రాణాలను తీసుకుంది. ఈ వైరస్ భారత్ లో కూడా అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. అంతేకాదు ఈ వైరస్ కారణంగా హైదరాబాద్, ఢిల్లీ వంటి మహానగరాల్లో స్కూల్స్ కూడా మూసేశారు అంటే ఎంత డెంజర్స్ వైరస్ ఓ మీరు ఏ అర్థం చేసుకోండి. 

 

ఇంకా ఈ వైరస్ పై కొన్ని కొన్ని నగరాల్లో విన్నూత ప్రదర్శన నిర్వహిస్తున్నారు.. హోలీ పండుగను పురస్కరించుకుని నిర్వహించే కామదహనానికి బదులుగా వర్లి వాసులు కరోనా దహనం చేశారు. ఎక్కడ అనుకుంటున్నారా? ఇలాంటి వింత ప్రదర్శనలు ఎక్కడ జరుగుతాయి? ముంబై నగరంలో ఈ వింత ప్రదర్శన జరిగింది. 

 

 

కరోనా వైరస్ పేరుతో ఓ బొమ్మను తయారు చేసి.. ఆ దిష్టి బొమ్మకు కరోనాసుర అని పేరు పెట్టి దాన్ని దహనం చేశారు. అంతే కాదు ఆ దిష్టి బొమ్మ మెడ చుట్టూ.. కరోనా వైరస్‌ను పోలిన దండను వేశారు. ఇలా కరోనా వైరస్ పై వారి వ్యతి రేకతను తెలిపి దహనం చేసేశారు. అయితే కరోనా వైరస్ సోకుతుంది అని హోలీ పండుగను ఈ సంవత్సరం చేసుకోవద్దు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన సంగతి తెల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: