చైనాలోని వుహాన్  నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ మన దేశ వ్యాప్తంగా శర వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చైనా దేశంలో మరణ మృదంగం మోగిస్తూ ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఇక ఈ వైరస్కు సరైన విరుగుడు కూడా లేకపోవడంతో.. ఈ వైరస్ సోకితే ప్రాణాలు పోవడం దాదాపు ఖాయంగా మారిపోయింది. చాలా తక్కువ మంది ఈ ప్రాణాంతకమైన వైరస్ బారి నుండి బయటపడ్డారు. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందిన ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి పడి  3800 మంది మరణించారు. ఏకంగా లక్షా పదివేల మందికి ఈ వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఇక ఈ వైరస్ వ్యాప్తిచెందిన ఆయా దేశాలు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.కాగా  ఈ వైరస్ ప్రభావం వల్ల ఏకంగా సరిహద్దుల వద్ద భారత్ సహా 14 దేశాల రాకపోకలపై నిషేధం విధించింది ఇరాన్.

 

 

 అయితే ఈ ప్రాణాంతకమైన వైరస్ కు కేంద్ర బిందువైన చైనాలో మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇక ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. సోమవారం కేవలం 40 మంది మాత్రమే ఈ వైరస్ బారిన పడినట్టు తెలిపింది చైనా ప్రభుత్వం. ఇక మిగతా దేశాలలో మాత్రం ఈ వైరస్ విజృంభిస్తోంది. ఇరాన్ లో కేవలం ఒక్క రోజులోనే 600 మంది ఈ వైరస్ బారిన పడటం ఇరాన్  ప్రభుత్వాన్ని ఆందోళన కలిగిస్తోంది. చైనాలో ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తున్నా నేపథ్యంలో  కొద్ది రోజుల్లో నిర్బంధాన్ని ఎత్తివేసే అవకాశం కూడా ఉంది. ఇక ఇరాన్ లో ఏడు వేల ఒక వంద 61 మంది ఈ ప్రాణాంతకమైన వైరస్ బారిన పడితే ఇప్పటికే 237 మంది చనిపోయారు.

 

 

 

 ఇక పర్యాటకులకు స్వర్గధామం అయినా మిలన్ లో కరోనా  ఎఫెక్టుతో పర్యాటకులు లేక వెలవెలబోతోంది. అక్కడి వీధులు బీచులు అని నిర్మానుష్యంగా మారిపోయాయి. అయితే మద్యం తాగితే కరోనాను  నియంత్రించవచ్చు అంటూ సోషల్ మీడియాలో వచ్చిన వదంతులను నమ్మి అతిగా మద్యం తాగడం వల్ల 27 మంది మృతి చెందిన ఘటనఇరాన్ లో  చోటు చేసుకుంది. తమకున్న లక్షణాలను చూసి... కరోనా  వచ్చిందేమో అని భావించి అతిగా మద్యం సేవించడం ద్వారా ఏకంగా 27 మంది మరణించారు. ఇక మన భారతదేశంలో కూడా కరోనా  వైరస్ పాజిటివ్ కేసుల  సంఖ్య ఏకంగా నలభై కి చేరిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: