ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిన విషయం తెలుసిందే. ఇంకొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత వస్తున్న మొదటి ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు తమ సత్తా చాటేందుకు సిద్ధమైంది పోయాయి. ఈసారి కూడా ఘన విజయం సాధించి మరోసారి సత్తా చాటాలని వైసీపీ ముందుకు సాగుతుంటే. ఈసారి  ఎలాగైనా విజయం సాధించి ఎన్నికల్లో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేయాలని టీడీపీ భావిస్తోంది. మరోవైపు బిజెపి జనసేన పార్టీ లో పొత్తుగా  ముందుకు సాగి మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలి అని అనుకుంటున్నాయి.

 

 

 అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 12 నగరపాలక సంస్థ లతో పాటు 75 మున్సిపాల్టీలు,  నగర పంచాయతీలో కూడా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలోని 15 నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా... కోర్టులో కేసులు వాయిదా పడిన నేపథ్యంలో మూడు నగరపాలక సంస్థల ఎన్నికలు జరగడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఎన్నికల హడావిడి ఉన్నప్పటికీ ఈ మూడు నగరపాలక సంస్థలకు మాత్రం ఎన్నికల హడావిడి లేకుండా పోయింది.

 

 

 అంతే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 104 మున్సిపాలిటీలు ఉంటే కేవలం 75 మున్సిపాలిటీలలో మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి.. కోర్టు కేసులు సహా కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం కావడం ఇలాంటి కారణాలతో... 29 మున్సిపాలిటీలలో ఎన్నికలు వాయిదా వేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది  దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలు,  నగరపాలక సంస్థల్లో  ఎన్నికల హడావిడి కనిపిస్తుంటే... ఎన్నికలు జరగని నగర పాలక సంస్థలు మున్సిపాలిటీలు ఎలాంటి హడావిడి లేక బోసిపోతున్నాయి. అయితే వాయిదా వేసిన చోట త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు అధికారులు. అంతేకాదండోయ్ కొన్ని చోట్ల సాంకేతిక కారణాలతో కూడా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావిడి ఉండి... వివిధ పార్టీ నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో... కొన్ని నగరపాలక పాలక  సంస్థలు,  మున్సిపాలిటీల్లో మాత్రం ఎన్నికలు జరగకపోవడంతో హడావిడికి దూరంగానే ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: