కరోనా...ప్రపంచాన్ని షేక్ చేస్తున్న వైరస్. గ్లోబ్ పై ఎక్కడ విన్నా...ఏ దేశంలో చూసినా ఇదే టాపిక్. ఇంతమందికి కరోనా వచ్చింది...ఇంత మంది చనిపోయారంటూ గగ్గోలు పెడుతున్నాయి ప్రభుత్వాలు. ఇక సేఫ్లీ కంటూ రకరకాల ప్రికాషన్స్ తీసుకుంటున్నాయి. ఇదంతా ఒకవైపైతే... ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనాకు వెల్ కమ్ అంటూ డోర్లు బార్ల తీస్తున్నాయి కొన్ని సంస్థలు. కరోనా ఇంపాక్ట్ ను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంతకీ కరోనాకు వెల్ కమ్ చేప్పే సాహసం చేస్తున్నా సంస్థలు ఏంటా అని అనుకుంటున్నారు కదా. అవేనండి మన పోర్న్ సైట్స్. 

 

 

పోర్న్ వీడియోలను తీసే సంస్థలు కరోనా ఎఫెక్ట్ ను బాగా వాడుకుంటున్నాయి. ఎక్కువ మంది ఇంటర్నెట్ లో ఈ వీడియోలను చూస్తుండడంతో...వీడియోల్లో నటించే వారికి కూడా కరోనా ఉన్నట్టు చూపిస్తున్నారు. వైరస్ సోకిన వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వీడియోల్లో వివరిస్తున్నారు. తాజాగా వైస్ అనే సంస్థ పోర్న్ హబ్‌లో ‘డిసర్టెడ్ ఉహాన్’ అనే వీడియోను విడుదల చేసింది. ఇందులో పూర్తిగా శరీరాన్ని కప్పి ఉంచిన మెడికల్ సూట్‌తో ఓ వ్యక్తి చీకటి గదిలోకి ఎంటర్ అవుతాడు. అక్కడ ఉన్న ఓ మహిళను కరోనా వైరస్ బాధితురాలిగా గుర్తిస్తాడు. ఆ తర్వాత ఆమెకు... వైరస్ ఇతరులకు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తాడు. 

 

 

వాస్తవానికి సాధారణ కరోనా వైరస్ సమాచారం తెలుసుకోవడం కంటే ప్రజలు పోర్న్ వీడియోలను చూడటానికే ఎక్కువ ఇష్టపడుతున్నారని చెబుతున్నాయి ఈ సంస్థలు. పైగా ఇంటర్నెట్‌లో ఎక్కువ మంది ఇవే వీడియోలను చూస్తున్నారని బల్ల బద్దలు కొడుతున్నాయి. కరోనా జాగ్రత్తలు ఎక్కువ మందికి చేరాలంటే ఇదే తగిన వేదిక అని ప్రచారం చేసుకుంటున్నాయి. తమ వెబ్ సైట్లను సందర్శించే వారికి కరోనాపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి వీడియోలను రూపొందిస్తున్నట్టు సగర్వంగా చెబుతున్నాయి. నిజానికి ‘పోర్న్’ పేరు వింటేనే మనలో ఒక చెడు అభిప్రాయం కలుగుతుంది. అలాంటిది వీరు మంచి కోసమే ఇదంతా చేస్తున్నామని చెప్పడం కొంచెం విడ్డూరంగానే అనిపిస్తోంది.  ( నోట్ : కరోనాను వాడుకుని ఆ ఇండస్ట్రీ ఎలాంటి పనులు చేస్తుందో చెప్పడానికే మా ఈ ప్రయత్నం )

 

మరింత సమాచారం తెలుసుకోండి: