ప్రపంచంలో ఘోరంగా ప్రబలిపోతూ మనుషు ప్రాణాలు హరించి వేస్తున్న కరోనా వైరస్ పేరు చెబితేనే గుండెల్లో వణుకు పుడుతంది. చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ మాయదారి వైరస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుంది.  కరోనా భారిన పడి ఇప్పటికీ మూడు వేలకు పైగా మరణాలు సంభవించాయి.  అయతే ఈ మద్య భారత్ లో కూడా కరోనా కేసులు నమోదు అయ్యాయి.  ఇప్పటికే నలభై వరకు కరోనా కేసులు నమోదు అయినట్లు అధికారిక ప్రకటన వచ్చింది.  తాజాగా తెలంగాణలో కరోనా బాధితులకు గాంధీ హాస్పిటల్ లో వైద్య చికిత్సలు అందిస్తున్నారు.  తాజాగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్రంలోని తొలి కరోనా బాధితుడు కోలుకున్నట్టు తెలుస్తోంది.

 

తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ రిపోర్టులు రావడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన ఈ యువకుడు దుబాయ్‌ వెళ్లి వచ్చి కరోనా బారినపడ్డాడు.  సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. మెరుగైన చికిత్స, వైద్యుల నిరంతర పర్యవేక్షణతో క్రమంగా యువకుడి ఆరోగ్యం కుదుటపడింది. అయితే మొదట ఇతని పరిస్థితి చూస్తే అగమ్య గోచరింగా ఉందని కానీ మెరుగైన చికిత్స సకాలానికి అందించడంతో బాగా కోలుకున్నాడని వైద్యులు అంటున్నారు.  తొలి మూడు రోజులు ఎలా ఉంటుందో? ఏమౌతుందోనని ఆందోళన చెందిన వైద్యులు ఇప్పుడిక ఇబ్బంది లేదని నిర్ధారణకు వచ్చారు.

 

మరోవైపు...కరోనాపై ప్రజల్లో అవగాహన కోసం తెలంగాణ సర్కార్‌ చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే రాజధాని నగరంలో వివిధ కూడళ్లలో భారీ హోర్డింగ్స్‌ ఏర్పాటు చేసింది. బస్సు, రైల్వే, మెట్రోస్టేషన్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే కరోనా వైరస్ సోకిన వారిని 48 గంటల అనంతరం నమూనాలు సేకరించి పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపుతారు. అక్కడినుంచి నివేదిక నెగెటివ్‌ అని వస్తే సాధ్యమైనంత త్వరగా డిశ్చార్జి చేసే అవకాశముంది. ఇంటికి పంపినా 14 రోజులు ఐసోలేషన్‌ జాగ్రత్తలు పాటించాలని సూచించనున్నారు. మొత్తానికి తెలంగాణలో తొలి కరోనా బాధితుడు బయట పడటం సంతోషకరమైన విషయం అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: