ప్రస్తుతం ప్రపంచ దేశాల ప్రజలను ప్రాణభయంతో వణికిస్తున్న కరోనా వైరస్. చైనాలోని వుహాన్  నగరంలో గుర్తించబడి ఈ మహమ్మారి వైరస్... చైనాలో మరణ మృదంగం మోగించిన విషయం తెలిసిందే. ఏకంగా చైనా దేశంలో మూడు వేల మందికి పైగా ఈ ప్రాణాంతకమైన వైరస్ పొట్టన పెట్టుకుంది. అంతేకాకుండా 90 వేల మంది ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. ఇక ఈ మహమ్మారి వైరస్ కు సరైన విరుగుడు కూడా లేకపోవడంతో ప్రజలందరూ వణికిపోతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే చైనా దేశంలో కరోనా  వైరస్ తగ్గుముఖం పడుతుంది. కరోనా  బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతుండటంతో పాటు  వైరస్ సోకిన వారు కూడా వైరస్ నుంచి బయటపడి కోలుకుంటున్నారు. 

 

 

 కానీ చైనా దేశంలో పరిస్థితి సద్దుమనుగుతుంటే  ఉంటే ఇతర దేశాలలో మాత్రం కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇక ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ భారతదేశంలో కూడా కరోనా వైరస్ వ్యాపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఏకంగా 40 కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి భారతదేశంలో. దీంతో ప్రజలందరూ కరోనా  రాకుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మాస్కూలు  దరిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా మాస్కులకి  గిరాకీ పెరిగి పోయిన విషయం తెలిసిందే. అయితే కరోనా  వైరస్ పుణ్యమా అని ఇక్కడ ఒక విచిత్ర సంఘటన జరిగింది. ఇక్కడ ఏకంగా దేవుడికి మాస్కులు పెట్టారు అక్కడి పూజారులు. 

 

 

 కరోనా  వైరస్ ఏకంగా దేవుడి ని సైతం భయ పడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా భగవంతుడి విగ్రహాన్ని భక్తులు ఎవరూ తాకకూడదు అంటూ విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లో గల విశ్వనాథ్ ఆలయం లో చోటుచేసుకుంది. ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన తెచ్చేందుకు మాస్కులు ధరించాలని చాటిచెప్పేందుకు విగ్రహానికి మాస్క్  కట్టినట్లు వివరించారు. ఇక దేవుని తాకకూడదు అని ఎందుకు చెప్పాము  అంటే... స్వామివారి విగ్రహాన్ని చేతితో తాకితే ఎక్కువమందికి కరోనా  వైరస్ సోకే ప్రమాదం ఉందని అంటూ నిబంధన పెట్టాము అంటూ  పూజారులు తెలిపారు. ఇక దేవుడికి మాస్కులు పెట్టడమే కాదు అక్కడికి వచ్చిన భక్తులు అందరూ కరోనా  నేపథ్యంలో మాస్కులు ధరించాలని పూజారులు అవగాహన కల్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: