నిజానికి పండుగ సమయాలలో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే చుక్కలు కనిపిస్తాయి. ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్‌ లో ఉన్న టికెట్లు కన్ఫార్మ్ అవ్వాలంటే దేవుడి మీద భారం వేయాల్సిందే. చాలా వరకు వెయిట్ లిస్టెడ్ టికెట్లు కన్ఫార్మ్ కాకపోవచ్చు. అయితే ఇప్పుడు ఐఆర్‌సీటీసీ ఒక స్కీమ్‌ ను ప్రజలకు అందిస్తోంది. ఆ కొత్త ఆప్షన్ పేరు వికల్ప్ స్కీమ్. దీనితో వెయిట్‌ లిస్టెడ్ టికెట్లు కలిగిన ట్రైన్ ప్యాసింజర్లకు ఒక ప్రయోజనం వస్తుంది.

 

IHG


ఈ సదుపాయం ఏమిటంటే రైల్వే ప్రయాణికులు వారు ప్రయాణించే మార్గాలలో ఒక ట్రైన్‌ లో సీటు దొరకకపోతే మరో ట్రైన్‌ లో బెర్త్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే మీరు ఒక ట్రైన్‌ లో టికెట్ బుక్ చేసుకోవాలని చూస్తే ఆ రైలులో అది వెయిటింగ్ లిస్ట్‌ లో ఉంది. అప్పుడు మీరు వికల్ప్ స్కీమ్‌ ను ఎంచుకుంటే మీరు ప్రయాణించే మార్గంలో వేరే ట్రైన్‌ లో ఏమైనా సీట్లు అందుబాటులో కానీ ఉంటే, అప్పుడు మీకు ఆ ట్రైన్‌ లో సీటును కన్ఫార్మ్ చేసి ఉంచుతుంది ఐఆర్‌సీటీసీ. కాకపోతే ఇక్కడ ఈ స్కీమ్ కింద కచ్చితంగా టికెట్ కన్ఫార్మ్ అవుతుందని మాత్రం అనుకోవద్దు. అక్కడ కూడా సీట్లు ఉంటేనే మాత్రం టికెట్ కన్ఫార్మ్ అవుతుంది సుమా...

 

IHG

ఐఆర్‌సీటీసీ లోని వికల్ప్ స్కీమ్ అన్ని రైళ్లకు, అన్ని తరగతులకు వర్తిస్తుంది. ఇందులో ముఖ్యంగా ఏ కోటా కింద టికెట్ బుక్ చేసుకున్న స్కీమ్ వర్తిస్తుంది. వికల్ప్ స్కీమ్ కింద ఐదు ట్రైన్ ఆప్షన్లు మనం ఇవ్వొచ్చు. మనం బుక్ చేసుకున్న చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా వెయిటింగ్ లిస్ట్‌ లో పేరు ఉన్న ప్యాసింజర్లకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుందని మైండ్ లో ఉంచుకోవాలి. ఈ ఆప్షన్ ని పండుగ సీజన్‌ లో అనుకోకుండా జర్నీ చేయాలని భావించే వారు ఐఆర్‌సీటీసీ వికల్ప్ స్కీమ్‌ ను బాగా ఉపయోగించుకోవచ్చు. వీటి కోసం ఐఆర్‌సీటీసీ ఎటువంటి ఎక్స్ట్రా చార్జీలు వాసులు చేయదు.

మరింత సమాచారం తెలుసుకోండి: