ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సీఎం పదవిని చేపట్టాక మొట్టమొదటిసారి స్థానిక ఎన్నికలకు సమాయత్తమవుతుంటే హైకోర్టు జగన్ కు గట్టి షాకే ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సచివాలయాలు దగ్గర నుండి వాటర్ ట్యాంకులు, స్కూల్లు, బోర్ పంపులు అని ఒకటేమిటి కనపడిన ప్రతి దానికి వారి కార్యకర్తలు తమ పార్టీ జెండా రంగులు వేయడం మొదలుపెట్టారు. దీనిపై అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. అప్పుడు వెంటనే హైకోర్టు కూడా స్పందించి ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క ఒక వస్తువు పైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నీ యొక్క రంగులు ఉండకూడదని ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

 

IHG

 

అయితే ఇప్పుడు జగన్ రానున్న స్థానిక ఎన్నికలకు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. బీసీ వర్గాల లో తన మైలేజీ పెంచుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్న జగన్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా స్థానిక ఎన్నికల కారణంగా ఈనెల 12 తేదీ నుండి 28 తేదీ వరకు అనగా 17 రోజుల వరకు రాష్ట్రంలో మద్యం దుకాణాలను బంద్ చేయిస్తున్నాడు. ఇలా ప్రజల్లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న జగన్ కు హైకోర్టు ఇప్పుడు తీవ్రమైన ఆదేశాలు జారీ చేసింది

 

IHG

 

రాష్ట్రంలో ఎక్కడెక్కడ గ్రామ సచివాలయాలకు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి పార్టీ జెండా పైన ఉండే రంగులు ఉన్నాయని వాటిని పది రోజుల్లోగా తొలగించాలని ఆదేశించింది. అసలు వైసిపి పార్టీ జెండా ఉండే గ్రామ మరియు వార్డు సచివాలకుగానీ ప్రభుత్వ కార్యాలయాలు గానీ రంగులు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో వైసిపి కార్యకర్తలు అంతా స్థానిక ఎన్నికల్లో తమ నేతలకు తోడుగా ప్రచారం చేసేందుకు బదులు వారి సమయాన్ని రంగులు తొలగించడం లోనూ మరియు వారికి కొత్త రంగులు వేయడం లోనూ గడుపుతారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: