రాజకీయాలు అన్న తర్వాత ఎప్పుడూ ఊహించని పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. ఎత్తులు పైఎత్తులు వేస్తూ తమ దైన వ్యూహాలతో ముందుకు సాగుతూనే వుంటారు. అయితే తాజాగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు కొత్త మలుపు తిరిగింది. 17 మంది ఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని కలవడం మధ్యప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ప్రత్యేక విమానంలో అకస్మాత్తుగా ఢిల్లీ బయల్దేరిన జ్యోతిరాదిత్య సింధియా... ముందుగా హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ప్రధాని మోదీని కలిశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈయన  ఒక్కసారిగా ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలతో భేటీ కావడం మధ్య ప్రదేశ్ రాజకీయాల్లో  చర్చనీయాంశంగా మారిపోయింది. 

 

 

 జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ లో చేరబోతున్నరనే  అనే చర్చ కూడా మొదలైపోయింది. జ్యోతిరాదిత్య సింధియా మోదీతో కలవడానికి వెనుక కారణం ఆమె బిజెపిలో చేరాలని అనుకుంటున్నారని రాజ్యసభ సభ్యత్వం తో పాటు కేంద్రంలో ఆయనకు ఓటు కల్పించనున్నారు అని హామీ రావడంతోనే జ్యోతిరాదిత్య సింధియా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు అంటూ మధ్యప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే కమలనాథ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ 17 మంది ఎమ్మెల్యేలు సోమవారం తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం విధితమే. కమలనాథ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన 17 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం జ్యోతిరాదిత్య సింధియా కు మద్దతుగా  బెంగళూరులో ఓ రిసార్టులో ఉన్నారు. ఇక ఈ 17 మంది ఎమ్మెల్యేలను సంప్రదించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. అయినప్పటికీ కాంగ్రెస్ సీనియర్ నేతలకు కూడా టచ్ లోకి రావడం లేదట ఈ 17 మంది ఎమ్మెల్యేలు. ఇక ఈ విషయం తెలిసిన ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్... సీనియర్ నేతలతో తన నివాసంలో ఏకంగా రెండు గంటల పాటు అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 

 

 

ఈ సందర్భంగా 22 మంది మంత్రులు రాజీనామా చేశారు. ఫలితంగా ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. అయితే జ్యోతిరాదిత్య సింధియా వర్గం ఎమ్మెల్యేలంతా మళ్లీ తిరిగి కమల్ నాథ్ శిబిరానికి చేరుతారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు.జ్యోతిరాదిత్య సింధియాను శాంతింప  పరిచేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు రంగంలోకి దిగి... ఆయనకు  పిసిసి పదవి లేదా రాజ్యసభ సీటును కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు సింధియా బిజెపిలో చేరుతారని ఆయనకు కేవలం రాజ్యసభ స్థానమే కాదు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్య ప్రదేశ్ రాజకీయాల్లో  మరెన్ని మలుపులు తిరుగుతాయో అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: