రెండు తెలుగు రాష్ట్రాల ను గత వారం రోజుల నుండి తెగ కంగారు పెడుతున్న కరోనా వైరస్ ఇప్పుడు ఏపీ మరియు తెలంగాణలో తగ్గిపోయింది. ఇంకా సంతోషకరమైన విషయం ఏమిటంటే మొట్టమొదటిసారి హైదరాబాదులో కరోనా బారినపడిన బెంగళూరు .టి ఉద్యోగికి వైరస్ పూర్తిగా తగ్గిపోయింది. గాంధీ ఆసుపత్రిలో ఇన్ని రోజులు ప్రత్యేక శ్రద్ధతో ఐసోలేషన్ వార్డులో ఉన్న యువకుడికి ఇకపై వైరస్ నుండి ఎటువంటి ముప్పు లేదు అని డాక్టర్లు తేల్చేశారు.

 

మొట్టమొదటిసారి కరోనా బాధిత వ్యక్తికి ఇప్పుడు జ్వరం కానీ, జలుబు కానీ, దగ్గు కానీ ఏమీ లేవని నిర్ధారించడంతో అతను అతి త్వరలోనే డిశ్చార్జి కానున్నాడు. అలాగే ఇప్పటి వరకూ మన భారతదేశంలో 45 మందికి వైరస్ సోకగా వారిలో ఒక్కరు కూడా చనిపోకపోవడం గమనార్హం. ఇక హైదరాబాదులోని బాధితుడి విషయానికి వస్తే ఇప్పటికే డాక్టర్లు మొత్తం నయం అయిపోయింది అని నిర్ధారించినా ఒకసారి రోజు అతని శాంపిల్స్ తీసుకొని పూణె ల్యాబ్ కి పంపనున్నారు.

 

అక్కడి నుండి రెండు రోజుల్లో రిపోర్టు వచ్చిన తర్వాత అతని శరీరంలో వైరస్ ఆనవాళ్లు ఏవి లేకపోతే ఇక వెంటనే డిశ్చార్జి చేసేస్తారు. ఇంకా తెలంగాణ ప్రభుత్వం మరియు ఆంధ్ర ప్రభుత్వం కరోనా విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. విమానాశ్రయాల దగ్గర్నుండి విదేశీయులు వస్తున్నారు అన్న అనుమానం ఉన్న ప్రతి చోటా వైద్య పరీక్షలు చేస్తూ ఎక్కడ అలసత్వం ప్రదర్శించడం లేదు

 

ఇటు ఆంధ్రప్రదేశ్ లో అనుమానితులే గాని బాధితులు ఎవరూ లేరు. దీనితో ఏపీ ప్రభుత్వం కూడా ఊపిరి పీల్చుకు౦ది. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి ముఖ్యంగా ఇటలీ సహా పలు దేశాల నుంచి వచ్చే వారికి అన్ని పరిక్షలు చేసిన తర్వాతే బయటకు పంపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: