ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పంచాయతీ ఆఫీసులకు... వైసీపీ జెండా రంగును వేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ భవనాలు గ్రామ పంచాయతీలకు వైసీపీ జెండా రంగులు వేయడం పై గతంలో కొన్ని వివాదాలు కూడా చెలరేగిన విషయం తెల్సిందే. ఇక అటు ప్రతిపక్ష పార్టీ కూడా జగన్ సర్కార్ కు  ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి రంగులు వేయడం లో ఉన్న శ్రద్ధ పాలనపై లేదు అంటూ ఎన్నో విమర్శలు కూడా గుప్పించాయి. ఈ క్రమంలోనే గతంలో గుంటూరు జిల్లా పల్లపాడు కు చెందిన ముప్పా  వెంకటేశ్వరరావు వైసీపీ సర్కార్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడం తప్పుబడుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

 


 అయితే వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం జగన్ సర్కార్ కు షాక్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యాలయాలకు వేసిన అధికార పార్టీ జెండా రంగులు పై కీలక తీర్పు వెల్లడించింది ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు. గ్రామ సచివాలయ భవనాలకు రాజకీయ పార్టీల రంగులను వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని పంచాయతీ భవనాలు ప్రభుత్వ భవనాలకు... సీఏస్  నిర్ణయం ప్రకారం పదిరోజుల్లో మళ్ళీ రంగులు వేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. 

 


 అయితే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పంచాయతీ భవనాలకు వైసిపి రంగులు తొలగించి వేరే రంగులు వేయాలి అంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసినట్లుగా ఆధారాలను నివేదిక రూపంలో సమర్పించాలని సీఎస్ ను  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. అయితే పంచాయతీ భవనాలకు రంగులు వేయాలంటూ 2018 ఆగస్టు 11న పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇచ్చిన  మెమోలు హైకోర్టు ఈ సందర్భంగా కొట్టివేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎంతో కీలకంగా మారిపోయింది. అయితే గ్రామాల్లో పంచాయతీ భవనాలకు ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగులు వేయడం పై అటు ప్రతిపక్ష టిడిపి పార్టీ కూడా ఎన్నో రోజుల నుండి తప్పుబడుతూ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున వెంటనే ఎన్నికల సంఘం స్పందించి తొలగించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో హైకోర్టు తీర్పుతో జగన్ సర్కార్ కు షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: