కరోనా విజృంభిస్తుండడంతో టీటీడీ అప్రమత్తమైంది. తిరుమలలో కరోనా వైరస్ ప్రబలకూండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. జ్వరం, దగ్గు, జలుబుతో బాధ పడుతున్న భక్తులు..  తిరుమల పర్యటన వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేసిన టీటీడీ. భక్తులు కూడా మాస్కులు ధరించాలని సూచించింది. 

 

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. దేశ, విదేశాల నుంచి సైతం పెద్దసంఖ్యలో భక్తులు వస్తుండడంతో .. తిరుమలలోను కరోనా అటెన్షన్ కనిపిస్తోంది.భక్తుల్లో అవగాహన ఉన్న వారు.. మాస్కులు ధరిస్తుంటే.. మరికొందరు మాత్రం స్వామి చూసుకుంటాడంటున్నారు. స్వామి సన్నిధిలో వైరస్ చచ్చిపోతుందని.. భయమక్కరలేదంటున్నారు.

 

 దేశంలోనూ కరోనా కేసులు నమోదవుతుండడంతో.. టీటీడీ అప్రమత్తమైంది. అధికారులతో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి.. అత్యవసర సమావేశం నిర్వహించారు. జనసమ్మర్థప్రాంతాలు అధికంగా ఉండడంతో.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. వసతిగదులు, తలనీలాలు సమర్పించే  ప్రదేశాలు, లడ్డూ, అన్నప్రసాద కౌంటర్లు... ఇలా జన సమ్మర్థ ప్రాంతాల్లో .. కరోనాపై చైతన్యం కలిగించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అలిపిరి వద్దే థర్మల్ స్ర్కీనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని టీటీడీ అధికారులు యోచిస్తున్నారు. భక్తులను పరిశిలించిన అనంతరం తిరుమలకు అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలిపిరి, శ్రీవారి నడకమార్గంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు ధర్మారెడ్డి తిరుమల వీధుల్లో ప్రతీ రెండు గంటలకు ఓ సారి ఫాగింగ్, ఇతర మందులు స్ప్పే చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదుగురు అధికారులుతో కమిటిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేశారు.

 

శ్రీవారిని దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుండటంతో.. భక్తులకోసం..  అశ్వని ఆసుపత్రిలో ప్రత్యేక వార్డుని ఏర్పాటు చేశారు. ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వారికి ప్రాధమిక సేవలు అందించి వెంటనే స్వీమ్స్ కి తరలించేలా ఏర్పాట్లు చేసారు. గతంలో స్వైన్ ప్లూ సమయంలోను తిరుమలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని అధికారులు గుర్తుచేస్తున్నారు. ఆ సమయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నా.... భక్తులు తాకిడి ఏమాత్రం తగ్గలేదని..... ఇప్పుడు కరోనా వైరస్ విషయంలోను అదే జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: