నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గతంలో మారుతీ రావు కూతురు అమృతం ప్రణయ్  అనే యువకుడిని  వివాహం చేసుకోవడంతో కక్షగట్టిన మారుతీరావు ఓ  వ్యక్తికి సుపారీ ఇచ్చి మరీ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో మారుతీరావు ఏకంగా ప్రధాన నిందితుడిగా జైలు శిక్ష కూడా అనుభవించాడు. అయితే తాజాగా మారుతీరావు ఆర్య వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకొని చనిపోవడం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేపింది. అసలు మారుతి రావు ది ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నప్పటికీ ఎలాంటి ఆధారాలు మాత్రం దొరకడం లేదు. అయితే మారుతీరావు మృతదేహం వద్ద ఒక సూసైడ్ నోట్ కూడా లభించిన విషయం తెలిసిందే. గిరిజ  నన్ను క్షమించు అమృత అమ్మ దగ్గరికి వెళ్లి పో అంటూ ఆ సూసైడ్ నోట్లో రాసి ఉంది. 

 


 అయితే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులోని ప్రధాన నిందితుడు అమృత తండ్రి మారుతీరావు మృతి మరో మలుపు తిరిగింది. మారుతీ రావు మృతి ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో విచారణను  సైఫాబాద్ పోలీసులు వేగవంతం చేశారు. అయితే మారుతీరావు విషం తాగడం వల్లే మృతి చెందినట్లు పోస్టుమార్టంలో తేలిందని ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే మారుతి రావు ఏ విషం  తాగాడు అన్నది మాత్రం విస్రా  నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టంగా తెలియనున్నది . ఈ నేపథ్యంలో మారుతి రావు అసలు విషన్ని ఎక్కడ కొన్నారు అనే అంశాలపై కూడా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే మారుతీరావు శవమై కనిపించిన ఆర్య వైశ్య భవన్ లోని రూమ్ లో కానీ లేదా ఆయన కారులో కానీ ఎలాంటి విషం సీసా కనిపించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. 

 


 దీంతో ఈ కేసును ఛేదించడం పోలీసులకు కాస్త సవాలుగానే మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ కేసులో మారుతిరావు డ్రైవర్ ని విచారించారు పోలీసులు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శనివారం మిర్యాలగూడ నుంచి మారుతీరావు డ్రైవర్ రాజేష్ తో కలిసి బయలుదేరారు. ఈ క్రమంలోనే ఓ ఎరువుల దుకాణం వద్ద కారు ఆపమని చెప్పిన మారుతిరావు ఆ షాప్  లోకి వెళ్లి కొంత సమయం తర్వాత తిరిగి వచ్చాడు. ఆ తర్వాత నేరుగా ఆర్య వైశ్య భవన్ కి వెళ్లారు మారుతీ రావు. ఈ క్రమంలోనే డ్రైవర్ తో గారెలు తప్పించుకున్నా మారుతీరావు విషన్ని అందులో కలుపుకొని తిని ఉంటారు అంటూ పోలీసులు అంచనా వేస్తున్నారు.   కానీ విస్రా  నివేదిక వచ్చిన తర్వాత మాత్రం మారుతీరావు ఆత్మహత్య చేసుకునేందుకు తాగిన విషం  ఏమిటి అన్నది స్పష్టంగా తెలియనుంది. ఇక ఆర్య వైశ్య భవన్ లో సీసీ పుట్టే ద్వారా  ఎవైన ఆధారాలు దొరుకుతాయా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. ఇక మారుతీరావు ఫోన్ కాల్ డాటాను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: