ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ప్రజా సంక్షేమ పాలనే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సీఎం జగన్ రాష్ట్రంలోని విద్యార్థినుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో శానిటరీ నాప్ కిన్స్ వెండింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురానుంది. 
 
అధికారులు ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం హిందుస్తాన్ లివర్ కంపెనీ సహకారంతో వెండింగ్ మెషిన్లను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ప్రభుత్వం మొదట పైలట్ ప్రాజెక్టుగా కొన్ని స్కూళ్లలో ఈ పథకాన్ని అమలు చేయనుంది. 
 
కొన్ని నెలల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో శానిటరీ నాప్‌కిన్స్ వెండింగ్ మిషన్లు అందుబాటులోకి రానున్నాయి. కేంద్రం ఈ పథకాన్ని చేపట్టగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రమంతటా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. మంత్రి ఆదిమూలపు సురేష్ కేంద్రంతో ఈ పథకం అమలు గురించి చర్చలు జరిపారని తెలుస్తోంది. 
 
విద్యార్థినులు వెండింగ్ మెషిన్లలో రూపాయి వేసి శానిటరీ నాప్‌కిన్ ను పొందవచ్చు. జనఔషధి దుకాణాల్లో కేంద్రం 4 రూపాయలకు నాప్‌కిన్స్ విక్రయిస్తోంది. సీఎం జగన్ మాత్రం కేవలం ఒక రూపాయికే విద్యార్థినులకు వీటిని అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వం పాఠశాలల్లో వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మొదట ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేసి రాష్ట్రమంతటా ఈ పథకాన్ని విస్తరించాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం అమలు చేయబోతున్న ఈ పథకంపై ప్రజల నుండి హర్షం వ్యక్తం అవుతోంది. మహిళలు, విద్యార్థినులకు ప్రయోజనం చేకూరేలా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: