సంవత్సరం క్రితం మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు.   తెలుగు రాష్ట్రాలను దాటుకొని, జాతీయం.. ఇంకా ప్రపంచ మీడియాలో సంచలనం సృష్టించిన ఆ హత్యను అంతత్వరగా మర్చిపోవడం అసాధ్యం. ఇక అందులో ఏ-1 ముద్దాయిగా వున్న అమృత నాన్న మారుతీరావు రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికి విదితమే.

 

ఈ ఆత్మహత్య తరువాత అందరి ఫోకస్ అతని ఆస్తి మీద పడింది.. ఈ నేపథ్యంలోనే, మారుతీరావు రాసిన వీలునామా పత్రాలను తాజాగా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇక పొతే నేడు కోర్టులో ప్రణయ్ హత్య కేసు తాలూకు విచారణ జరుగనుండగా, చార్జ్ షీట్ కు అదనంగా ఈ వీలునామా పత్రాల కాపీలను పోలీసులు జత చేయనున్నారు. ఎందువల్లనంటే, ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు చనిపోవటంతో, అతని పేరును సదరు కేసు రిజిష్టరులో.. తొలగించి, మిగతా వారిపై కేసు విచారణ కొనసాగించాల్సిందిగా పోలీసులు కోర్టును అభ్యర్థించనున్నారు.

 

అదలా ఉంచితే, మారుతి రావు ఆస్తి విషయమై సోషల్ మీడియాలో రక రకాల ఉదాంతాలు వినబడుతున్నాయి. ఏదో ట్రస్టు కు రాసేశారని, ఇంకెవరి పేరుమీదనో మొత్తం రాసేశారని.. ఇలా వివిధ రకాలుగా ఎవరికి తోచింది వారు చెప్పుకుంటూ పోతున్నారు. కానీ, మారుతి రావు బంధు వర్గాల సమాచారం మేరకు, అమృత పేరు మీద వున్న ఆస్తిని, తన కూతురు ఇక తన వద్దకు రాదని భావించిన మారుతీరావు కొంతకాలం క్రితమే తన వీలునామాను మార్చి రాసినట్టుగా వినికిడి. 

 

అమృతకు చిల్లి గవ్వ కూడా చెందకుండా అతని ఆస్తిని... సభాగం అతని భార్య అయిన గిరిజ కు, మిగిలిన భాగాన్ని తమ్ముడు అయిన శ్రవణ్ పేరిట రిజిస్టర్ చేయించినట్లు వినికిడి. వీటి కాపీలు కూడా ఇప్పుడు పోలీసుల అధీనంలో వున్నాయట! సదరు కాపీలను పొలిసు శాఖవారు కోర్టుకు సమర్పించి, ఏ1గా ఇతని పేరుని తొలగించాలని కోర్టుకు సూచిస్తారట.. ఇక ఈ కేసులో ఏ1గా మారుతీరావు ఉండగా, ఏ6గా ఆయన తమ్ముడు శ్రవణ్ వున్న విషయం అందరికి విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: