మధ్యప్రదేశ్ ప్రభుత్వం లో సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడడానికి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ యువనేత జ్యోతిరాదిత్య సింధియా వర్గం కాంగ్రెస్ కు  రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈరోజు హుటాహుటీన  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు కాంగ్రెస్ యువనేత జ్యోతిరాదిత్య సింధియా. ఈ సందర్భంగా కాంగ్రెస్ కు  రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక జ్యోతిరాదిత్య సింధియా తో పాటు ఆరుగురు మంత్రులు సహా 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై  చెప్పేశారు. అంతేకాదు తమ ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో వీరి  రాజీనామా చర్చనీయాంశంగా మారిపోయింది. 

 

 

 

 దీంతో మధ్యప్రదేశ్ సర్కార్ లో  ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో  మరో ట్విస్ట్ తెరమీదికి వచ్చింది. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన బిఎస్పి సమాజ్వాది పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారు. సమాజ్వాది పార్టీ ఎమ్మెల్యే రాజేష్ శుక్లా,  బీఎస్పీ ఎమ్మెల్యే రాజేష్  కుష్వాహా  మధ్యప్రదేశ్ మాజీ సీఎం బీజేపీ కీలక నేత శివరాజ్ సింగ్ చౌహన్  తో భేటీ అయ్యారు. ఇప్పటికే సంక్షోభం ఏర్పడిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం లో బిజెపి సమాజ్వాది పార్టీ బీఎస్పీ  ఎమ్మెల్యేల భేటీ మరింత చర్చనీయాంశంగా మారిపోయింది. ఇక భోపాల్ లోని ఆయన ఇంటికి వెళ్లి... తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు బిఎస్పి  సమాజ్వాది పార్టీ ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా చౌహాన్ వారిని మద్దతు ఇవ్వాల్సిందిగా కోరినట్లు సమాచారం. ఇక ఆయన విజ్ఞప్తికి ఇటు సమాజ్వాది పార్టీ ఎమ్మెల్యేలు సహా బిఎస్పి ఎమ్మెల్యేలు కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

 

 

 అయితే కేవలం వారూ  హోలీ శుభాకాంక్షలు చెప్పేందుకు మాత్రమే వచ్చామని.. ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదు అంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పడం గమనార్హం. అయితే మొత్తం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 230 సీట్లు ఉండగా కాంగ్రెస్ కి 114 బీజేపీకి 107 మంది సభ్యుల సంఖ్య బలంగా ఉంది. ఇక ఇండిపెండెంట్లు నలుగురు,  ఇద్దరు బీఎస్పీ సభ్యులు,  ఒక సమాజ్వాది పార్టీ ఎమ్మెల్యే... కాంగ్రెస్ పార్టీకి  మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ బిజెపిలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మరణించడంతో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం 17 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పినా వాళ్ళు బీజేపీకి మద్దతు ఇస్తే బిజెపి మధ్యప్రదేశ్లో బీజేపీ  అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: